NTV Telugu Site icon

Sunitha Laxma Reddy : కొత్తగా ఎనికైన సభ్యులు మమ్మల్ని అవహేళన చేశారు

Sunitha Laxma Reddy

Sunitha Laxma Reddy

అసెంబ్లీలో నాలుగున్నర గంటలు మేము నిలబడినా మాకు అవకాశం ఇవ్వలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కొత్తగా ఎనికైన సభ్యులు మమ్మల్ని అవహేళన చేశారన్నారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులపై మహిళా మంత్రులు ఎందుకు మాట్లాడటం లేదని ఆమె ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు గత ప్రభుత్వం అని మాట్లాడుతున్నారని, మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్న సంఘటనలపై ఎందుకు మాట్లాడటం లేదని ఆమె అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మహిళలను అట్లా మాట్లాడవచ్చా.. అని ఆమె ప్రశ్నించారు. అందరి రాజకీయ పరిస్థితులు వేరు… సబితా ఇంద్రారెడ్డి, నా రాజకీయ ప్రస్థానం.. మా రాజకీయ పరిస్థితులు వేరని, సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలను వారి విజ్ఞతకు వదిలి వేస్తున్నా అన్నారు. నన్ను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేస్తే బీఆర్ఎస్ పార్టీలో చేరాను అని ఆమె వెల్లడించారు.

Gottipati Ravi Kumar: ఎన్నికల టైంలో పెన్షన్ల కోసం బ్యాంకుల చుట్టూ తిరిగి 50 మంది వృద్ధులు మరణించారు..

నేను బీఆర్ఎస్ పార్టీలో చేరినప్పుడు ఎమ్మెల్యే కాదని, నేను సీఎం రేవంత్ రెడ్డిని 2018లో నర్సాపూర్ తీసుకువెళ్ళినప్పుడు రెండు కేసులు అయ్యాయని చెప్పారన్నారు. అదే సమయంలో నాపైన మూడు కేసులు అయ్యాయని, నేను కేసులు తీయించుకున్నానని ఆమె తెలిపారు. రేవంత్ రెడ్డి అవగాహన లోపంతో మాట్లాడుతున్నారని, నేను 2023 ఎన్నికల అఫిడవిట్ లో నాపైన ఉన్న కేసులను పొందుపరిచానన్నారు. స్పీకర్ అసెంబ్లీలో మాకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని, సభలో కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యేలను ఒకలా.. బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలను ఒకలా సీఎం చూస్తారా…? అని ఆమ మండిపడ్డారు.

Trump: ఒక మహిళ కారణంగానే ప్రాణాలతో ఉన్నా.. స్టేజ్‌పైకి పిలిచి హగ్ చేసుకున్న ట్రంప్