NTV Telugu Site icon

Sunita Williams: సునీతా విలియమ్స్‌కు స్వాగతం పలికిన అందమైన సముద్ర జీవులు.. (వీడియో)

Sunita Williams

Sunita Williams

సునీతా విలియమ్స్ భూమిపై అడుగుపెట్టారు. స్పేస్‌ఎక్స్ క్యాప్సూల్ ఫ్లోరిడా తీరంలో దిగిన విషయం తెలిసిందే. ఆమె దిగిన వెంటనే.. ఆ క్రూ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ క్యాప్సూల్‌ చుట్టూ అనేక డాల్ఫిన్లు చుట్టుముట్టాయి. ఈ డాల్ఫిన్లు చాలా సేపు క్యాప్సూల్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి. వాటిని చూస్తుంటే ఏదో చెప్పాలనుకుంటున్నట్లు అనిపించింది. ఈ అందమైన దృశ్యానికి సంబంధించిన వీడియో కూడా బయటపడింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంటర్నెట్‌లో ఈ అందమైన వీడియో చూసిన తర్వాత.. డాల్ఫిన్లు సునీతా విలియమ్స్‌కు మొదటగా స్వాగతం పలికాయని నెటిజన్లు కామెంట్‌లు చేస్తున్నారు. నాసా తన విలేకరుల సమావేశంలో కూడా ఈ అందమైన దృశ్యం గురించి ప్రస్తావించింది.

READ MORE: Deputy CM Pawan Kalyan: ఎవ్వరినీ వదలని పవన్‌ కల్యాణ్‌.. ట్వీట్‌ వైరల్

స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్‌లో సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్‌లతోపాటు, నాసా వ్యోమగామి, మిషన్ కమాండర్ నిక్ ‌హేగ్, రోస్‌కాస్మస్ వ్యోమగామి అలెగ్జాండర్ గుర్బునోవ్‌లు భూమి మీదకు సురక్షితంగా వచ్చారు. దీంతో, ప్రపంచమంతా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన మిషన్ విజయవంతంగా పూర్తయింది. క్రూ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ భూమిపైకి చేరిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 2024 జూన్ 5న టెస్ట్ మిషన్ కోసం స్టార్‌లైనర్ అంతరిక్ష నౌకలో వీరిద్దరూ ప్రయాణించారు. ఎనిమిది రోజుల తర్వాత వారు తిరిగి భూమ్మీదకు రావాల్సింది. కానీ స్టార్‌లైనర్ అంతరిక్షనౌక, ఐఎస్‌ఎస్‌ను చేరుకోగానే సమస్యలు తలెత్తాయి. అంతరిక్షనౌకను నడిపించే అయిదు థ్రస్ట్‌లు పనిచేయడం మానేశాయి. దానిలోని హీలియం కూడా అయిపోయింది. దీంతో అంతరిక్షనౌక మండే ఇంధనంపై ఆధారపడాల్సి వచ్చింది. ఫలితంగా ఇద్దరు వ్యోమగాముల రాక ఆలస్యమైంది.