Site icon NTV Telugu

Sundeep Kishan: హిట్ డైరెక్టర్‌తో కొత్త సినిమా ప్రారంభించిన సందీప్ కిష‌న్!

Pawan Kalyan

Pawan Kalyan

Sundeep Kishan New Movie Starts Today: టాలీవుడ్ యువ హీరో సందీప్‌ కిషన్‌ ఇటీవల ‘ఊరిపేరు భైరవకోన’ చిత్రంతో మంచి హిట్ ఖాతాలో వేసుకున్నాడు. సినిమా ఇచ్చిన స‌క్సెస్‌తో వ‌రుస సినిమాల‌ను లైన్‌లో పెట్టాడు. ఇప్ప‌టికే స్వరూప్‌ ఆర్‌ఎస్‌జే ద‌ర్శ‌క‌త్వంలో ‘వైబ్‌’ సినిమా చేస్తున్న సందీప్.. తాజాగా మ‌రో సినిమాను ప్రారంభించాడు. మాస్ మహారాజా, శ్రీలీల జంటగా నటించిన ‘ధమాకా’తో మంచి హిట్‌ అందుకున్న డైరెక్టర్ త్రినాథరావు నక్కిన ద‌ర్శ‌క‌త్వంలో సందీప్‌ తన 30వ సినిమాను ప్రారంభించాడు.

Also Read: T20 World Cup 2024: టీమిండియా టీ20 ప్రపంచకప్‌ ప్రోమో.. గూస్‌ బంప్స్‌ పక్కా!

నేడు హ‌నుమాన్ జ‌యంతి సంద‌ర్భంగా సందీప్‌ కిషన్‌ తన కొత్త సినిమాను ఆరంభించాడు. ఎస్‌కే 30 సినిమా మంగ‌ళవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత దిల్ రాజ్ క్లాప్‌నివ్వగా.. విజయ్ కనకమేడల కెమెరా స్విఛాన్‌ చేశారు. ఇక అనిల్ సుంకర గౌరవ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి రాజేశ్‌ దండా నిర్మాత కాగా.. ప్రసన్నకుమార్‌ కథ, కథనం, మాటలు అందిస్తున్నారు. పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ చిత్రంలో సందీప్‌ డిఫరెంట్‌ కేరక్టర్‌లో కనిపించనున్నారట. అత్యున్నత సాంకేతిక విలువలతో భారీ స్థాయిలో ఎస్‌కే 30 రూపొందనున్నదని మేకర్స్‌ చెబుతున్నారు.

Exit mobile version