Site icon NTV Telugu

Sunday Special : కోడి పులావ్ ను ఇలా చేశారంటే.. మెతుకు కూడా మిగల్చరు..

Kodipulav

Kodipulav

చికెన్ తో ఎన్నో రకాల వంటలను చేసుకుంటాం..చికెన్ తో చేసే వంటకాలు రుచిగా ఉండడంతో పాటు వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. అయితే బిర్యానిలు తిని తిని బోర్ కొడుతుంది.. చికెన్ పులావ్ అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరు.. పులావ్ ను సులభంగా కూడా తయారు చేసుకోవచ్చు. అలాగే మనం వివిధ రుచుల్లో ఈ పులావ్ ను తయారు చేస్తూ ఉంటాము. అందులో భాగంగా ఎంతో రుచిగా ఉండే కోనసీమ కోడి పులావ్ ను ఎలా తయారు చేస్తే రుచి వేరే లెవల్ ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..

కావల్సిన పదార్థాలు..

నూనె – అర కప్పు,

దాల్చిన చెకక్క ముక్కలు – 2,

మరాఠీ మొగ్గ – 2,

బిర్యానీ ఆకు – 1,

అనాస పువ్వు – 1,

కరివేపాకు – ఒక రెమ్మ,

సన్నగా పొడుగ్గా తరిగిన పెద్ద ఉల్లిపాయ – 1,

తరిగిన పచ్చిమిర్చి – 6,

జీడిపప్పు – గుప్పెడు,

అల్లం వెల్లుల్లి పేస్ట్ – రెండు టీ స్పూన్స్,

ఉప్పు- తగినంత,

పసుపు – అర టీ స్పూన్,

కారం – 3 టీ స్పూన్స్,

చికెన్ – ముప్పావు కిలో,

తరిగిన కొత్తిమీర – రెండు టేబుల్ స్పూన్స్,

తరిగిన పుదీనా – రెండు టేబుల్ స్పూన్స్,

కొబ్బరి పాలు – ఒక కప్పు,

అర గంట పాటు నానబెట్టిన బాస్మతీ బియ్యం – 2 కప్పులు,

నీళ్లు – 3 కప్పులు,

నిమ్మరసం – అర చెక్క,

బిర్యాని మసాలా – తగినంత..

తయారీ విధానం :

ముందుగా బిర్యాని మసాలాను అప్పటికప్పుడు తయారు చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది.. లేకుంటే మీ చాయిస్..తరువాత అడుగు మందంగా ఉండే గిన్నెలో నూనె వేసి వేయించాలి. తరువాత మసాలా దినుసులు, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, జీడిపప్పు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. దీనిని పచ్చి వాసన పోయే వరకు వేయించిన తరువాత ఉప్పు, పసుపు, కారం వేసి కలపాలి.. ఆ తర్వాత చికెన్ ను వేసి 7 నిమిషాల పాటు బాగా ఉడకానివ్వాలి.. కొత్తిమీర, పుదీనా, మిక్సీ పట్టుకున్న మసాలా పొడి వేసి కలపాలి.దీనిని రెండు నిమిషాల పాటు వేయించిన తరువాత కొబ్బరి పాలు పోసి కలపాలి. తరువాత మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించాలి.. ముందుగా కడిగిపెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి..రెండు టీ స్పూన్ల నెయ్యి వేసి కలపాలి. తరువాత మరలా మూత పెట్టి మంటను చిన్నగా చేసి పూర్తిగా ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.. ఆ తర్వాత కొద్ది సేపు అలానే వదిలెయ్యాలి.. తర్వాత పెరుగు చట్నీ వేసుకొని వేడి వేడిగా తింటే టేస్ట్ వేరే లెవల్ అంతే.. చెప్తుంటే నోరు ఊరిపోతుంది కదూ.. మీరు కూడా ట్రై చెయ్యండి..

Exit mobile version