Site icon NTV Telugu

New Delhi : ఫార్మా రంగంలో సన్ ప్రభంజనం.. బ్రెయిన్ స్ట్రోక్ సరికొత్త మెడిసిన్

Sun Pharma

Sun Pharma

Sun Pharma: మారుతున్న కాలంతో పాటు మనిషి వేషధారణ, ఆహారపు అలవాట్లు మారుతూ వస్తున్నాయి. పెరిగిన టెక్నాలజీ తో కాలుష్యం పెరిగింది. తాగే నీరు తినే ఆహారం కలుషితం అయిపోయింది. ఇది మనిషి ఆరోగ్యం పైన ప్రభావం చూపింది. ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా ఎంతోమంది బీపీ, షుగరు తో బాధ పడుతున్నారు. కొందరిలో ఈ బీపీ షుగర్ కారణంగా బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్స్ ఏర్పడి పక్షవాతం కూడా వచ్చిన సంఘటనలు కూడా ఉన్నాయి. కొన్ని సందర్భాలలో ప్రమాదాలకు గురైనప్పుడు కూడా రక్తనాళాల్లో క్లాట్స్ ఏర్పడి రక్త ప్రసరణ జరగదు. అలాంటి సమస్యలకు ఓ కొత్త ఔషధం మార్కెట్లోకి రానుంది.

వివరాలలోకి వెళ్తే.. ప్రస్తుతం ఉన్న ప్రముఖ ఫార్మా సంస్థల్లో సన్ ఫార్మా ఒకటి. మార్కెట్లో సన్ ఫార్మకి ఉన్న క్రేజ్ వేరే ఏ కంపెనీ కి లేదనే చెప్పాలి. కాగా సన్ సంస్థ. ఫార్మా రంగంలో మరో అడుగు ముందు కేసింది. సన్ ఫార్మాకి చెందిన ఒక అనుబంధ సంస్థ అమెరికాకు చెందిన ఫార్మాజ్‌ అనే బయోఫార్మా కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది.

Also Read: Asia Cup Final: ఆసియా కప్‌ అంటేనే రెచ్చిపోతున్న శ్రీలంక.. ఏకంగా 12 సార్లు ఫైనల్‌కు! భారత్‌ మాత్రం..

ఈ ఒప్పందం ప్రకారం ఫార్మాజ్‌ సంస్థ అభివృద్ధి చేస్తున్న సోవాటెల్‌టైడ్‌ అనే ఔషధాన్ని విక్రయించేందుకు సన్‌ ఫార్మాకు లైసెన్సు ఇవ్వనుంది. ఈ మెడిసిన్ బ్రెయిన్ కి రక్త ప్రసరణ ఆగిపోవడం కారణంగా తలెత్తే సమస్యలని నివారించడానికి ఈ మెడిసిన్ ఉపయోగపడుతుంది. ఈ మెడిసిన్ మార్కెట్లో విడుదలైతే బ్రెయిన్ స్ట్రోక్ కారణంగ మరణించే వారి సంఖ్య చాలావరకు తగ్గే అవకాశం ఉంది అని నిపుణులు పేర్కొన్నారు.

Exit mobile version