Beer Sales: సమ్మర్ ఎఫెక్ట్.. తెలంగాణలో మద్యం కిక్కు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒకవైపు సూరీడు మండిపోతున్నాడు. ఉక్కిరి బిక్కిరి చేస్తున్న ఉక్కపోత.. వీటి నుంచి సేద తీరేందుకు మద్యం ప్రియులు చిల్డ్ బీర్ కావాలంటున్నారు. గత కొన్నాళ్ళుగా ఎండలు ఎక్కువవటంతో బీర్ల అమ్మకాలు బాగా పెరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా గత ఏడాది ఏప్రిల్‌తో పోల్చితే ఈ సారి ఏకంగా 90 శాతం అమ్మకాలు పెరిగాయని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. విస్కీ, ఇతర మద్యం అమ్మకాలు కూడా 3 శాతం పెరిగాయి. అన్ని రకాల మద్యం అమ్మకాలు సేల్ వాల్యూపరంగా చూస్తే గత ఏడాదితో పోల్చితే 19 శాతం పెరిగినట్టు తెలుస్తోంది.
ఈ ఏడాది ఏప్రిల్‌లో రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల నుంచి 49,84,285 కేసుల బీర్లు, 27,69,998 కేసుల ఇతర మద్యం సీసాలు అమ్ముడుపోయాయి. ఎండల తీవ్రతల కారణంగానే మద్యం అమ్మకాలు పెరిగినట్టు అధికారులు చెబుతున్నారు. కరెంటు కోతలు లేకపోవటంతో రాష్ట్రంలో చిల్డ్ బీర్లు దొరుకుతున్నాయి. దీంతో విస్కీ, బ్రాందీ, ఇతర మద్యం కంటే ఎక్కువ మంది బీర్లు కొనేస్తున్నారు. బీర్లకు భారీగా గిరాకీ ఏర్పడిందని, మద్యం ప్రియులు ఎండాకాలం బీర్లపైనే ఆధారపడుతున్నారని నిర్వాహకులు చెబుతున్నారు.
Also Read
2021-22 లో లిక్కర్ 26,87,808 కేన్లు అమ్ముడయితే, బీర్లు 26,12,694 కేన్లు అమ్మేశారు. 2022-23లో లిక్కర్ 27,69,998 కేన్లు తాగితే బీరు ఏకంగా 43,84,285 కేన్లు తాగేశారు. తెలంగాణల బీర్ల అమ్మకాల్లో 10 జిల్లాల్లో కరీంనగర్ టాప్ లో నిలిచింది. 150 శాతం వరకూ అక్కడ బీర్ల అమ్మకాలు పెరిగినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత మెదక్ లో 146 శాతం, కామారెడ్డిలో 124 శాతం అమ్మకాలు ఎక్కువగా నమోదయ్యాయి. నిర్మల్ జిల్లాలో 123 శాతం, ఆదిలాబాద్‌లో 122 శాతం, సంగారెడ్డి జిల్లాలో 120 శాతం బీర్ల అమ్మకాలు ఎక్కువగా జరిగాయని అధికారులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో ఎక్సైజ్ ఆదాయం మరింతగా పెరగనుంది.
Minister KTR : నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. రాబోయే 18 నెలల్లో 20 వేల ఉద్యోగాలు
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!