Site icon NTV Telugu

Sumalatha Johnny Master: తెలుగు ఫిల్మ్ డాన్సర్స్ అసోసియేషన్ ఎన్నికల్లో జానీ మాస్టర్ భార్య సుమలత ఘన విజయం..!

Jani Master Sumalatha

Jani Master Sumalatha

Sumalatha Johnny Master: తెలుగు ఫిల్మ్ డాన్సర్స్ అసోసియేషన్ ఎన్నికల్లో జానీ మాస్టర్ భార్య సుమలత ఘన విజయం సాధించారు. 29 ఓట్ల భారీ మెజారిటీతో ఆమె ప్రత్యర్థి జోసెఫ్ ప్రకాశ్ మాస్టర్‌ను ఓడించారు. మొత్తం 510 ఓట్లలో 439 ఓట్లు పోలయ్యాయి. ఈ ఎన్నికల్లో సుమలత ఎలాంటి గ్రూప్‌లు, పెద్దల మద్దతు లేకుండా ఒంటరిగా పోటీ చేయడం ప్రత్యేకంగా నిలిచింది. మరోవైపు జోసెఫ్ ప్రకాశ్‌కు సీనియర్, ప్రముఖ డాన్స్ మాస్టర్లు అండగా నిలిచారు. శేఖర్ మాస్టర్, భాను మాస్టర్, రఘు మాస్టర్, పోళ్లకి విజయ్, జోజో శామ్, చంద్ర కిరణ్ వంటి ప్రముఖులు జోసెఫ్‌కు బహిరంగ మద్దతు తెలిపారు.

Japan 7.6 Earthquake: జపాన్‌ను వణికించిన భారీ భూకంపం.. వైరల్‌గా మారిన వీడియో

అలాగే నటి, డాన్సర్ సృష్టి వర్మ కూడా ఉదయం నుంచే ఎన్నికల హాల్లో తినకుండా కూర్చొని ప్రత్యర్థికి మద్దతుగా శ్రమించడం ఎన్నికలకు మరింత హీట్‌ను జోడించింది. సుమలతను ఓడించేందుకు సృష్టి వర్మ తీవ్రంగా ప్రయత్నించినా.. సుమలతకు లభించిన భారీ మద్దతుతో ఫలితం మారలేదు. సీనియర్ డాన్స్ మాస్టర్ల మద్దతు ఉన్నా, ఒంటరిగా పోటీ చేసిన సుమలత విజయం డాన్సర్స్ అసోసియేషన్ లో పెద్ద చర్చకు దారితీస్తుంది.

కొత్త ఫీచర్లు, 5500mAh రీప్లేసబుల్ బ్యాటరీ, ప్రైవసీ స్విచ్‌తో కొత్త Jolla Phone లాంచ్..!

టీఎఫ్‌టీడీడీఏ ప్రెసిడెంట్ ఎలక్షన్స్‌లో మొత్తం 510 ఓట్లలో 439 ఓట్లు పోలయ్యాయి. అందులో సుమలత జానీ మాస్టర్‌కు 228 ఓట్లు, జోసెఫ్ ప్రకాష్‌కు 199, చంద్రశేఖర్‌కు 11 ఓట్లు వచ్చాయి. మొత్తంగా 29 ఓట్ల మెజారిటీతో సుమలత విజయం సాధించారు. అయితే ఈ ఎన్నికల్లో తను నిలబడితే మళ్లీ కుట్రలు పన్ని అడ్డంకులు కలగజేస్తారనే అనుమానంతో జానీ మాస్టర్ తన భార్యని ప్రెసిడెంట్ రేసులో ఉంచారు. ఇక్కడ జానీ మాస్టర్ తన సతీమణిని ప్రెసిడెంట్‌గా నిలబెట్టి ఆమెకు సముచిత గౌరవాన్ని అందించారు. తనపై ఆరోపణలు వచ్చిన సమయంలో సుమలత కూడా ఎంతో క్షోభకు గురయ్యారు. భర్తపై అలాంటి ఆరోపణలు వస్తే ఇంకొకరు అయితే బయటకు కూడా రారు. కానీ సుమలత తన భర్తకు ఎంతగానో అండగా నిలిచారు. మానసికంగా ఎంతో ధైర్యాన్నిచ్చారు. అందుకే జానీ మాస్టర్ ఆ గాయం నుంచి త్వరగా కోలుకుని ‘చికిరి చికిరి’ లాంటి అద్భుతమైన పాటను ఇవ్వగలిగారు. మొత్తంగా మనం మంచి చేస్తే అదే మనల్ని రక్షిస్తుందనే నమ్మకాన్ని జానీ మాస్టర్ తన విషయంలో నిరూపించారు.

Exit mobile version