Suma Kanakala : ఆ మూవీ కోసం రెమ్యూనరేషన్ తీసుకోకుండానే యాంకరింగ్ చేసిన సుమ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘బిగ్ బాస్’ తెలుగు రియాలిటీ షోతో బాగా పాపులారిటి తెచ్చుకున్న సయ్యద్ సోహెల్ ‘బిగ్ బాస్’ హౌస్ నుంచి బయటకు వచ్చాక, వరుస సినిమా అవకాశాలతో వెండితెరపై సత్తా చాటుతున్నారు. ఇప్పటికే ‘ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు’, ‘లక్కీ లక్ష్మణ్’మరియు ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ లాంటి సినిమాల్లో నటించి అలరించాడు. ఎక్కువగా కామెడీ ఎంటర్టైనర్లలో నటిస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నాడు.తాజాగా సోహెల్ హీరోగా ‘బూట్ కట్ బాలరాజు‘ అనే సినిమా తెరకెక్కింది. కోనేటి శ్రీను దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. మేఘ లేఖ హీరోయిన్ గా నటించింది. ఎండీ పాషా ఈ సినిమాను నిర్మించారు. భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి మ్యూజిక్ అందించారు.ఈ చిత్రంలో సీనియర్ నటి ఇంద్రజ, సునీల్, సిరి హన్మంతు, జబర్దస్త్ రోహిణి, ముక్కు అవినాష్ మరియు సద్దాం ముఖ్య పాత్రలు పోషించారు. ఫిబ్రవరి 2న విడుదలకానున్న ఈ సినిమాకు సంబంధించి ప్రమోషనల్ కార్యక్రమాలు మొదలయ్యాయి. ఇప్పటికే విడుదలైన పాటలు మరియు టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. తాజాగా ‘బూట్ కట్ బాలరాజు‘ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సోహెల్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం యాంకర్ సుమ గారు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని చెప్పారు. “మేము ఉన్న పరిస్థితిని సుమ అక్కకు చెప్పాం” అని సోహైల్ తెలిపారు. “నేను పేరు సంపాదించుకున్నాను. డబ్బు సంపాదించుకున్నాను. నా కొడుకును ప్రమోట్ చేయడానికి ఎంత కష్టపడ్డానో..నాకు తెలుసు. ఇప్పుడు నువ్వు అదే పరిస్థితిలో ఉన్నావు. మీ దగ్గర డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారని తెలుసు. మీ దగ్గర ఉంటే తీసుకునేదాన్ని. అయినా, మీ లాంటి వాళ్లకు హెల్ఫ్ చెయ్యకపోతే ఎలా..నేను వస్తున్నాను. ఫ్రీగా ఈవెంట్ చేస్తున్నాను” అని సుమ చెప్పారని సోహెల్ తెలిపారు. ”మా కష్టం తెలుసుకుని వచ్చిన సుమక్కకు థ్యాంక్స్” అని సోహెల్ తెలిపాడు.స్టార్ యాంకర్ గా కొనసాగుతున్న సుమ ఒక్కో ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రూ. 5 లక్షల చొప్పున తీసుకుంటుందని సమాచారం..ఆమె కేవలం పెద్ద హీరోలు అలాగే భారీ బడ్జెట్ సినిమాల ఈవెంట్లను మాత్రమే చేస్తుంది. అయినప్పటికీ, చిన్న హీరో సోహెల్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో యాంకర్ గా అదీ ఉచితంగా చేయడంతో ఆమెపై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.
Also Read
- Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
- Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!