Sukumar: Sukumar: పుష్పా సినిమాతో ప్యాన్ ఇండియా లెవల్‌లో సంచలనం సృష్టించిన దర్శకుడు సుకుమార్. ఆర్య సినిమాతో తన సినిమా జర్నీని స్టార్ చేసి పుష్పా సినిమాతో టాలీవుడ్ సరిహద్దులను బద్దలు కొట్టి ప్యాన్ ఇండియా డైరెక్టర్ అయ్యాడు ఈ లెక్కల మాస్టర్. ఈ స్టార్ డైరెక్టర్ పుష్పా వంటి ప్యాన్ ఇండియా సినిమాకు ముందు హీరో రామ్‌చరణ్‌తో రంగస్థలం అనే సినిమాను తెరకెక్కించి సూపర్ హిట్‌ను అందుకున్న విషయం తెలిసిందే. నిజానికి సుకుమార్ రంగస్థలం కథను ఫస్ట్ ఎవరికి చెప్పాడో తెలుసా..
READ ALSO: Deepinder Goyal: మిస్టరీ పరికరంపై జొమాటో సీఈఓ సంచలన పోస్ట్..
ఒక ఇంటర్వ్యూలో డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ.. రంగస్థలం కథను ఫస్ట్ టైం అర్జున్ వై.కె కి చెప్పినట్లు తెలిపాడు. ఒక రోజు నైట్ రంగస్థలం సినిమాకు సంబంధించిన కథ ఐడియా వచ్చిందని, ఒక 18 – 20 నిమిషాల క్లైమాక్స్ కథ ఐడియా వస్తే అర్జున్ వై.కె ని పిలిచి తనకే చెప్పినట్లు వెల్లడించారు. ఆ సమయంలో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుందని గుర్తు చేశారు. అర్జున్‌కు కథ చెబితే ఏం మాట్లాడకుండా వెళ్లిపోయాడని అన్నారు. తర్వాత ఫోన్ చేసి బాగుందని చెప్పాడని పేర్కొన్నారు. అయితే అసలు సంగతి తర్వాత చెప్పాడని సుకుమార్ వెల్లడించారు. అర్జున్‌కు కథ చెప్పిన టైంలో తను దానిని ఊహించుకున్నాడని, అందుకే కథ చెప్పిన తర్వాత తన అభిప్రాయం ఏమిటో చెప్పకుండా అలా వెళ్లిపోయడాని అన్నారు. కానీ ఆ తర్వాత తను ఫోన్ చేసి కథ బాగుందని అన్నట్లు తెలిపారు. ఇంతకీ అర్జున్ వై.కె ఎవరో తెలుసా.. డైరెక్టర్ సుకుమార్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన వ్యక్తి. ‘ప్రసన్న వదనం’ అనే సినిమాతో ఆయన టాలీవుడ్‌లో దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఫేస్ బ్లైండ్‌నెస్ అనే విభిన్న కాన్సెప్ట్‌తో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జగడం నుంచి సుకుమార్ తెరకెక్కించిన అన్ని సినిమాలకు అర్జున్ పని చేశాడు. ఈ లెక్కల మాస్టర్ తన నెక్ట్స్ సినిమాను హీరో రామ్‌చరణ్‌తో తెరకెక్కించే పనిలో ఉన్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన రైటింగ్ వర్క్ కంప్లీట్ అయినట్లు సమాచారం.
READ ALSO: Indian Cricketers Retirement 2025: రో-కోతో పాటు 2025లో రిటైర్ అయిన భారత ఆటగాళ్ల జాబితా ఇదే..
