Sukumar: ‘1 నేనొక్కడినే’ సినిమాను నేనే ఫ్లాప్ చేశానేమో.. షాకింగ్ కామెంట్స్ చేసిన సుకుమార్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sukumar: టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ – సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో వచ్చిన ‘1 నేనొక్కడినే’ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆశించిన విజయం సాధించకపోయినా, తెలుగు సినిమా చరిత్రలో ఒక ‘కల్ట్ క్లాసిక్’గా నిలిచిపోయింది. ‘1 నేనొక్కడినే’ గురించి ఇప్పటికీ సోషల్ మీడియాలో చర్చ జరుగుతూనే ఉంటుంది. ఈ సినిమా స్క్రీన్ ప్లే, మేకింగ్ హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయని ఫ్యాన్స్ కొనియాడుతుంటారు. అయితే, ఈ సినిమా రిజల్ట్ గురించి డైరెక్టర్ సుకుమార్ మనసులో ఒక పెద్ద బాధ ఉండిపోయిందట. అయితే, ఈ సినిమాకు సంబంధించి సుకుమార్ ఒక ఇంటర్వ్యూలో సంచలన విషయాన్ని బయటపెట్టారు. ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి తానే కారణమేమో అని ఇప్పటికీ అనిపిస్తుందన్నారు. అసలు మరో అద్భుతమైన వెర్షన్ తన దగ్గర ఉండేదని ఆయన చెప్పారు. ఆ వెర్షన్లో సినిమా వచ్చి ఉంటే దాని రేంజ్ వేరేలా ఉండేదని అభిప్రాయపడ్డారు.
Also Read
- Rohit Sharma Retirement: లార్డ్స్‌లో ఫేర్వెల్ మ్యాచ్..? ఇంటర్నేషనల్ క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్నాడా..!
- India vs England: రెండో వన్డేలో ఓటమిపై కెప్టెన్ గిల్ అసంతృప్తి.. వాళ్లే కారణం..!
- COVID-19: ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. నలుగురు మృతి.. ప్రజలకు కీలక సూచనలు
- రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ సినిమాకి సంబంధించి తన దగ్గర మరో వెర్షన్ ఉండేదని చెప్పారు. ఇంటర్వెల్ వరకు హీరోకి మానసిక సమస్య ఉందని సినిమాలో చూస్తాం. కానీ సుకుమార్ రాసుకున్న మరో వెర్షన్ ఏంటంటే, హీరోకి అసలు ఎలాంటి సమస్య లేదని, కేవలం శత్రువులను దెబ్బకొట్టడానికి హీరోనే ఒక పెద్ద ‘డ్రామా’ ప్లే చేస్తున్నాడని ఉండేదట. ఈ వెర్షన్లో గనుక సినిమా తీసి ఉంటే, మూవీలో హీరోయిజం పీక్స్‌లో ఉండేదని సుకుమార్ వెల్లడించారు. కానీ అప్పట్లో ఏదో ఒక ‘ఎమోషన్’ మిస్ అవుతుందేమో అన్న భయంతో తాను రెండో వెర్షన్ వైపు వెళ్ళలేదని, ఎమోషనల్ యాంగిల్లోనే సినిమాను పూర్తి చేశానని చెప్పారు. ఈ కొత్త వెర్షన్ గురించి విన్నప్పుడు సినిమా నిర్మాత తనను సరదాగా తిట్టారని, సుకుమార్ గుర్తు చేసుకున్నారు. “కనీసం ఎడిటింగ్ టేబుల్ మీద ఆ వెర్షన్‌ని కూడా ఒకసారి చెక్ చేసుకునే అవకాశం ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ” ఈ సినిమాని నేనే ఫ్లాప్ చేశానేమో అని నాలో నాకే బాధ కలుగుతుంటుంది” అని సుకుమార్ తన మనసులోని మాటను బయటపెట్టారు. సుకుమార్ కెరీర్ విషయానికి వస్తే.. పుష్పా వంటి సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయారు ఈ లెక్కల మాస్టార్. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు విషయానికి ఆయన ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళితో ‘వారణాసి’ అనే పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నారు.
READ ALSO: PM Kisan 22nd Installment: రైతన్నలకు అలర్ట్.. ఈ ఒక్క తప్పు చేస్తే పీఎం కిసాన్ నిధులు గోవిందా!
తాజావార్తలు
-
Samantha : ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన సమంత ఇండస్ట్రీ హిట్ MIB
-
Rohit Sharma Retirement: లార్డ్స్‌లో ఫేర్వెల్ మ్యాచ్..? ఇంటర్నేషనల్ క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్నాడా..!
-
India vs England: రెండో వన్డేలో ఓటమిపై కెప్టెన్ గిల్ అసంతృప్తి.. వాళ్లే కారణం..!
-
RBI New Rules 2026: రుణ ఎగవేతదారులకు ఆర్బీఐ భారీ షాక్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్
-
Astrology: జాతకంలో శని శుభప్రదంగా ఉన్నప్పుడు.. జీవితంలో అద్భుతమైన మార్పులు.. ఇవే ఆ సంకేతాలు!
ట్రెండింగ్
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్‌లో లాంచ్..!