SSY: ఆడపిల్ల భవిష్యత్తుకు బెస్ట్ పొదుపు పథకం.. నెలకు రూ.1,500 కడితే.. చేతికి రూ.8.32 లక్షలు.. పూర్తి వివరాలు ఇవే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sukanya Samriddhi Yojana: ఆడపిల్ల పుట్టిన మరుక్షణమే ప్రతి తల్లిదండ్రుల మనసులో ఒకటే ఆలోచన మెదులుతుంది. రేపు తన ఉన్నత చదువులకు, పెళ్లికి డబ్బులు ఎలా సర్దుబాటు చేయాలి? అని. ఆ సమయంలో ఆర్థిక ఇబ్బందులు రాకూడదంటే చిన్నప్పటి నుంచే పొదుపు మొదలుపెట్టడం చాలా ముఖ్యం. ఈ అవసరాన్ని గుర్తించే కేంద్ర ప్రభుత్వం ‘బేటీ బచావో, బేటీ పఢావో’ ప్రచారంలో భాగంగా సుకన్య సమృద్ధి యోజన (SSY) అనే అద్భుతమైన పథకాన్ని తీసుకువచ్చింది. ఇందులో చిన్న చిన్న మొత్తాలను సుదీర్ఘకాలం పాటు జమ చేస్తూ పాప భవిష్యత్తు కోసం ఒక పెద్ద నిధిని సులభంగా సమకూర్చుకోవచ్చు. ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం..
ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి 10 సంవత్సరాల వయసు వచ్చేలోపు ఎప్పుడైనా ఈ ఖాతాను తెరవవచ్చు. పాప చదువులకు లేదా పెళ్లి సమయానికి సరిగ్గా చేతికి డబ్బులు అందేలా ఈ పథకం డిజైన్ చేయబడింది. ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా పేద, మధ్యతరగతి, ధనిక కుటుంబాల వారు ఎవరైనా ఇందులో చేరవచ్చు. ఎందుకంటే ఇందులో ఏడాదికి కనీసం రూ.250 నుంచి గరిష్టంగా రూ.1.50 లక్షల వరకు పొదుపు చేసుకునే వెసులుబాటు ఉంది. ఒకవేళ మీరు ఈ పథకంలో ప్రతి నెల రూ.1,500 చొప్పున జమ చేస్తే, సంవత్సరానికి మీ పెట్టుబడి రూ.18,000 అవుతుంది. సుకన్య సమృద్ధి నిబంధనల ప్రకారం 15 సంవత్సరాల పాటు మీరు ఈ మొత్తాన్ని జమ చేస్తే, మీ జేబు నుంచి వెళ్లే మొత్తం పెట్టుబడి రూ.2.70 లక్షలు మాత్రమే. ప్రస్తుతం ఈ పథకానికి ప్రభుత్వం 8.2% వార్షిక వడ్డీని అందిస్తోంది. ఈ లెక్కన మీరు దాచుకున్న రూ.2.70 లక్షలపై దాదాపు రూ.5,61,917 కేవలం వడ్డీ రూపంలోనే లభిస్తుంది. ఫలితంగా మెచ్యూరిటీ సమయానికి మీ చేతికి మొత్తం రూ.8,31,917 వస్తుంది. అంటే మీరు పెట్టిన చిన్న పెట్టుబడి కాంపౌండింగ్ మహిమతో ఏకంగా రూ.8.32 లక్షల పెద్ద నిధిగా మారుతుందన్నమాట. అయితే ప్రభుత్వ వడ్డీ రేట్లలో వచ్చే మార్పులను బట్టి చివరిగా వచ్చే మొత్తంలో కూడా స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది.
Also Read
అయితే.. ఈ ఖాతా తెరిచిన నాటి నుంచి 15 సంవత్సరాలు మాత్రమే డబ్బులు కట్టాల్సి ఉంటుంది. కానీ ఈ పథకం పూర్తి మెచ్యూరిటీకి 21 సంవత్సరాలు పడుతుంది. అంటే 15 ఏళ్ల పాటు కట్టిన తర్వాత చివరి 6 సంవత్సరాలు మీరు ఒక్క రూపాయి కూడా జమ చేయాల్సిన పనిలేదు. అయినప్పటికీ, మీ ఖాతాలోని మొత్తంపై ప్రభుత్వం వడ్డీని జోడిస్తూనే ఉంటుంది. ఈ దీర్ఘకాలిక కాంపౌండింగ్ ప్రక్రియే చిన్న మొత్తాన్ని అంత పెద్ద నిధిగా మార్చడంలో సహాయపడుతుంది. ఇక్కడ గమనించాల్సిన కీలక విషయం ఏంటంటే, మీరు నెలకు చేసే రూ.1,500 డిపాజిట్ తేదీ కూడా మీకు వచ్చే లాభాన్ని ప్రభావితం చేస్తుంది. మీరు ప్రతి నెలా 5వ తేదీ కంటే ముందే ఈ రూ.1,500 జమ చేస్తే పైన చెప్పుకున్న రూ.8.32 లక్షల నిధి వర్తిస్తుంది. అలా కాకుండా, ఏడాది మొత్తానికి సంబంధించిన రూ.18,000లను ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలోనే ఒకేసారి డిపాజిట్ చేస్తే, మెచ్యూరిటీ నాటికి మీకు దక్కే మొత్తం ఏకంగా రూ.8.61 లక్షలకు పెరుగుతుంది. అంటే పెట్టుబడి మొత్తం ఒక్కటే అయినప్పటికీ, మీరు డబ్బు జమ చేసే సమయాన్ని బట్టి చేతికి అందే తుది మొత్తంలో వ్యత్యాసం ఉంటుంది. ఆడపిల్లల భవిష్యత్తుకు కొండంత అండగా నిలిచే ఈ సుకన్య సమృద్ధి యోజన, వారి ఉన్నత చదువులు, పెళ్లి ఖర్చుల బాధ్యతను తేలికగా నెరవేర్చడానికి తల్లిదండ్రులకు ఒక గొప్ప అవకాశమని చెప్పవచ్చు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!