NTV Telugu Site icon

Sriranga Neethulu : సుహాస్ ‘ శ్రీరంగనీతులు ‘ ట్రైలర్ వచ్చేసింది..

Sriranganeethulu

Sriranganeethulu

టాలీవుడ్ హీరో సుహాస్ బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్నాడు.. ఈ ఏడాది వచ్చిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.. ప్రస్తుతం ఓటీటీలో దూసుకుపోతుంది.. ప్రస్తుతం శ్రీరంగనీతులు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. యువ నటులు సుహాస్‌, కార్తీక్‌రత్నం, రుహానిశర్మ, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.. ప్రవీణ్‌కుమార్ వీఎస్ఎస్ దర్శకత్వం వహిస్తుండగా.. రాధావి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై వెంకటేశ్వరరావు బల్మూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది..

ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ అందరిని ఆకట్టుకుంది.. ఇప్పుడు తాజాగా ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు.. ఈ ట్రైలర్ లో మూడు డిఫరెంట్ కథలను చూపించారు.. వారు నిత్యం ఏం చేస్తారు… అందులో ముఖ్యంగా సుహాస్ గోడ దూకే సన్నివేశం హైలెట్ గా నిలుస్తుంది..యూత్ ఫెమస్ అవ్వడానికి ఏం చేస్తారు. సోషల్ మీడియా ఫాలోవర్స్ పెంచుకోవడం కోసం యువత చేస్తున్న పనుల గురించి ట్రైలర్ లో చూపించారు.. మొత్తానికి ట్రైలర్ ఆసక్తిగా మారింది..

ఈ సినిమా మొత్తం యువత చేస్తున్న పనులపై చిత్రంలో చూపించారు.. యువతరం భావోద్వేగాలతో, సినిమాలోని పాత్రలతో తమను తాము ఐడెంటిఫై చేసుకునే కథలతో, సహజంగా సాగే మాటలు, మనసుకు హత్తుకునే సన్నివేశాలతో వచ్చే సినిమాలు తక్కువనే చెప్పాలి.. ఎంతసేపు రొమాన్స్, యాక్షన్ కథల సినిమాలు వస్తున్నాయి.. సరిగ్గా అలాంటి సినిమానే ఈ చిత్రం అంటున్నాడు డైరెక్టర్ ప్రవీణ్‌కుమార్. ఇక త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం అన్నారు. హర్షవర్థన్ రామేశ్వర్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ ఏప్రిల్ 11 న విడుదల కాబోతుంది.. ఈ సినిమా ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి..

Show comments