సుడిగాలి సుధీర్ అలియాస్ సుధీర్ ఆనంద్ హీరోగా ఇటీవల కొత్త చిత్రం ఆరంభమైన విషయం తెలిసిందే. ప్రసన్న కుమార్ కోట దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ‘హైలెస్సో’ అని టైటిల్ ఖరారు చేశారు. సుధీర్ సరసన హీరోయిన్లుగా నటాషా సింగ్, నక్ష శరణ్ నటిస్తున్నారు. అక్షర గౌడ కీలక పాత్ర చేస్తున్నారు. ఈ సినిమాను వజ్ర వారాహి సినిమాస్ బ్యానర్‌పై శివ చెర్రీ, రవి కిరణ్ నిర్మిస్తున్నారు.
హైలెస్సో సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. హైదరాబాద్ పరిసరాల్లో కీలక సన్నివేశాలను డైరెక్టర్ తెరకెక్కిస్తున్నారు. నిర్మాతలు రవి కిరణ్, శివ చెర్రీలు ఖర్చుకు అస్సలు వెనకాడడం లేదు. ఎక్కడా రాజీపడకుండా భారీ ఖర్చుతో సినిమాను నిర్మిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న హైలెస్సో సినిమా వచ్చే ఏడాది సమ్మర్‌లో రిలిజ్ కానుంది. ఇప్పటివరకు పూర్తయిన పార్ట్‌పై చిత్ర యూనిట్ సంతృప్తిగా ఉందట. సినిమా చాలా బాగా వస్తుందని డైరెక్టర్, నిర్మాతలు సంతోషంగా ఉంరని తెలుస్తోంది.
Also Read: Virat Kohli: కోపం లేదు, నిరాశ లేదు, నిశ్శబ్దం మాత్రమే.. విరాట్ వీడ్కోలు చెబుతాడా?
గ్రామీణ నేపథ్యంలో వస్తున్న హైలెస్సో సినిమాలో శివాజీ విలన్‌గా కనిపించనున్నారు. సినిమాకు అనుదీప్ దేవ్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాని తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాతో సుడిగాలి సుధీర్ మంచి హిట్ కొట్టాలని చూస్తున్నాడు. బుల్లితెర నటుడైన సుడిగాలి సుధీర్ హీరోగా మారి 4 సినిమాలు చేశాడు.
