NTV Telugu Site icon

Harom Hara : సుధీర్ బాబు ‘హరోం హర ‘ నైజాం హక్కులు దక్కించుకున్న ప్రముఖ నిర్మాణ సంస్థ..

Haromhara

Haromhara

Harom Hara : టాలీవుడ్ హీరో సుధీర్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ హీరో “ప్రేమ కథా చిత్రం” సినిమాతో తన కెరీర్ లో మంచి విజయం అందుకున్నాడు.ఆ సినిమా తరువాత సుధీర్ బాబు ఎన్నో సినిమాలలో నటించాడు.కానీ ఆ సినిమాలేవీ అంతగా ఆకట్టుకోలేదు.సుధీర్ బాబు ఈ సారి ఎలాగైనా మంచి హిట్ అందుకోవాలని చూస్తున్నాడు.సుధీర్ బాబు నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ “హరోం హర” ..ది రివోల్ట్ అనేది ఈ సినిమా ట్యాగ్ లైన్.. ఈ సినిమాను జ్ఞానసాగర్‌ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు.ఈ సినిమాలో మాళవిక శర్మ హీరోయిన్ గా నటిస్తుంది.సుమంత్‌ జి.నాయుడు ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.

Read Also :Manamey : మొదటి రోజు కంటే భారీగా.. కలెక్షన్స్ లో దూసుకుపోతున్న ‘మనమే’..

ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా ..చిత్ర యూనిట్ విడుదల తేదీ కూడా ప్రకటించింది. ఈ చిత్రాన్ని జూన్ 14న విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్‌తో పాటు ట్రైలర్‌లు విడుదల చేయగా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.ఇదిలా ఉంటే ఈ చిత్రం ఈ సినిమా నైజాం డిస్ట్రిబ్యూషన్ హాక్కులను టాలీవుడ్ టాప్ నిర్మాణ సంస్థ అయిన మైత్రి మూవీ మేకర్స్ దక్కించుకున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.తాజాగా దీనికి సంబంధించి స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసారు.ప్రస్తుతం ఈ పోస్టర్ బాగా వైరల్ అవుతుంది.

Show comments