NTV Telugu Site icon

Sudheer Babu : రాజమౌళి మూవీలో సరికొత్త మహేష్ ని చూస్తారు..

Mahesh

Mahesh

Sudheer Babu : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ ఈ ఏడాది “గుంటూరు కారం” సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది.ఇదిలా ఉంటే ప్రస్తుతం మహేష్ ఫ్యాన్స్ తన తరువాత సినిమాకోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.మహేష్ తన తరువాత మూవీ దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్నాడు.ఈ సినిమాను దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై కె.ఎల్.నారాయణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.రాజమౌళి ఈ సినిమాను బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కిస్తున్నారు.
Read Also :Kalki 2898 AD : బుజ్జి పరిచయ వేదికకు సర్వం సిద్ధం..స్పెషల్ గా నిలువనున్న ఆ బైక్ స్టంట్ షో..?

భారీ అడ్వెంచరస్ మూవీగా వస్తున్న ఈ మూవీ “ఎస్ఎస్ఎంబి 29” అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతుంది.ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి టాలీవుడ్ హీరో సుధీర్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.తన అప్ కింగ్ మూవీ “హరోం హర” ప్రమోషన్స్ లో భాగంగా సుధీర్ బాబు మహేష్ ,రాజమౌళి మూవీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.మహేష్ రాజమౌళి సినిమా కోసం కంప్లీట్ గా చేంజ్ అవుతున్నాడు.ఫుడ్ విషయంలో ఎంతో కేర్ తీసుకునే మహేష్ ప్రస్తుతం ఎలాంటి లిమిట్స్ లేకుండా ఫుడ్ తినేస్తున్నాడు.నిత్యం వర్క్ అవుట్ చేస్తూ ఎంతో కష్ట పడుతున్నాడు.మహేష్ డెడికేషన్ చూసి ఆశ్చర్యం వేసిందని సుధీర్ బాబు తెలిపారు.

Show comments