Harom Hara Movie Release Date: సుధీర్ బాబు, మాళవిక శర్మ జంటగా నటిస్తున్న చిత్రం ‘హరోం హర’. జ్ఞానసాగర్ ద్వారక తెరకెక్కిస్తున్న ఈ సినిమాను సుమంత్ జీ నాయుడు నిర్మిస్తున్నారు. ఇందులో సునీల్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. చిత్తూరు జిల్లా కుప్పంలోని 1989 నాటి పరిస్థితుల నేపథ్యంలో రూపొందుతున్న యాక్షన్ సినిమా ఇది. ప్రస్తుతం హరోం హర పోస్ట్-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా విడుదల తేదీని తాజాగా చిత్ర యూనిట్ ప్రకటించింది.
Also Read: Bangalore Rave Party: ఎన్టీవీ చేతిలో బెంగళూరు రేవ్ పార్టీ రిపోర్ట్.. వెలుగులోకి కీలక విషయాలు!
జూన్ 14న ప్రపంచ వ్యాప్తంగా హరోం హర విడుదల అవుతుందని చిత్ర యూనిట్ నేడు ప్రకటించింది. చేతిలో తుపాకీతో ఉన్న సుధీర్ బాబు ఫొటోను రిలీజ్ చేసి మేకర్స్ ఈ వార్తను అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాను ముందుగా మే 31న రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. జూన్ 14న ఏ సినిమా విడుదలకు లేదు. దాంతో హరోం హర సోలోగా విడుదల కానుంది. ఆకట్టుకునే పాటలు, ఆసక్తిని రేకెత్తించే టీజర్ ఈ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. ఈ చిత్రంకు చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు.