Sudheer Babu : మహేష్ తో సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sudheer Babu : టాలీవుడ్ హీరో సుధీర్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.సూపర్ స్టార్ మహేష్ బాబు బావగా సుధీర్ బాబు ఎస్ఎంఎస్ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు.ఆ సినిమాతో నటుడుగా సుధీర్ బాబు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.ఆ తరువాత సుధీర్ బాబు నటించిన “ప్రేమ కథా చిత్రం” సూపర్ హిట్ అయింది.హారర్ కామెడీ చిత్రంగా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది.ఈ చిత్రంతోనే సుధీర్ బాబు సూపర్ హిట్ అందుకున్నారు.అయితే సుధీర్ బాబు ఆ తరువాత చేసిన సినిమాలు ఏవి కూడా అంతగా ఆకట్టుకోలేదు.తాజాగా ఈ హీరో “హరోం హర” అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అయ్యాడు.చిత్తూరు జిల్లా కుప్పంలోని 1989 నాటి పరిస్థితుల నేపథ్యంలో ‘హరోం హర’ను దర్శకుడు జ్ఞానసాగర్ ద్వారక తెరకెక్కించారు.ఈ సినిమాలో మాళవిక శర్మ హీరోయిన్ గా నటించింది.అలాగే ఈ సినిమాలో సునీల్ కీలకపాత్ర పోషించారు. ఈ నెల 31న ‘హరోం హర ‘ సినిమా విడుదల కానుంది.
తాజాగా ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సుధీర్ బాబు ఆసక్తిర వ్యాఖ్యలు చేసారు.మీ కెరీర్ లో అంచనాలు తప్పిన సినిమా ఏది అని ప్రశ్నించగా ”ప్రేమకథా చిత్రమ్’ తప్ప తాను చేసిన అన్ని సినిమాల ఫలితాల విషయంలోతాను ఎంతగానో నిరుత్సాహపడినట్లు సుధీర్ బాబు తెలిపారు. నా చిత్రాలను ప్రేక్షకులకు చేరువ చేయడంలో నేను ఫెయిల్ అయ్యానేమో అనిపించిందని సుధీర్ బాబు తెలిపారు. నేను నటించిన కొన్ని సినిమాలు టెక్నికల్‌గా బాగున్నా ఆశించిన ఫలితం ఇవ్వలేదు” అని సుధీర్ బాబు తెలిపారు.అలాగే మహేష్ బాబుతో మల్టీస్టారర్ మూవీ ఎప్పుడు చేస్తారు అని అడగగా అందుకు తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు సుధీర్ బాబు తెలిపారు. మల్టీస్టారర్ గురించి తమ మధ్య ఎలాంటి చర్చ జరగలేదు.అది సాధ్య పడితే త్వరలోనే ఆ సినిమా మొదలవుతుంది అని సుధీర్ బాబు తెలిపారు .
Also Read
- Balapur Ganesh 2026: పూరి జగన్నాథ ఆలయాన్ని తలపించేలా భారీ సెట్టింగ్.. బాలాపూర్ గణేశుడి వద్ద కనువిందు
- Ganesh Chaturthi 2026: బంగారు పూతతో మోదక్.. ధర తెలిస్తే షాకే..! వైరల్‌గా మారిన స్వీట్!
- Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
- iPhone 17 Pro Discount: ఐఫోన్ 17 ప్రోపై ఊహించని డిస్కౌంట్.. రూ.69,990కే సొంతం చేసుకునే ఛాన్స్!
తాజావార్తలు
-
Balapur Ganesh 2026: పూరి జగన్నాథ ఆలయాన్ని తలపించేలా భారీ సెట్టింగ్.. బాలాపూర్ గణేశుడి వద్ద కనువిందు
-
Assam Shocker: భార్య తల నరికి ఫ్రిజ్‌లో పెట్టిన నిందితుడు.. పోలీసు వాహనం నుంచి దూకి మృతి
-
Bollywood : సూపర్ హీరో కథలపై బాలీవుడ్ స్టార్ హీరోస్ మోజు
-
Movies Without Trailers: ట్రైలర్ లేకుండానే థియేటర్లలోకి వచ్చిన సినిమాలు ఇవే.. లిస్ట్‌లో నాని కొత్త సినిమా!
-
Ganesh Chaturthi 2026: బంగారు పూతతో మోదక్.. ధర తెలిస్తే షాకే..! వైరల్‌గా మారిన స్వీట్!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!