NTV Telugu Site icon

Sudheer Babu Tag: సుధీర్ బాబుకి కొత్త టాగ్‌.. ఏంటో తెలుసా?

Sudheer Babu Tag

Sudheer Babu Tag

Sudheer Babu Gets Nava Dhalapathy Tag: టాలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపుగా అందరి హీరోలకు ఓ ‘టాగ్‌లైన్’ ఉంది. అగ్ర హీరోలు చిరంజీవికి ‘మెగాస్టార్’, వెంకటేష్‌కి ‘విక్టరీ’, బాలకృష్ణకి ‘నటసింహం’, నాగార్జునకి ‘కింగ్’, మహేష్ బాబుకి ‘సూపర్ స్టార్’, పవన్ కళ్యాణ్‌కు ‘పవర్ స్టార్’, ఎన్టీఆర్‌కి ‘యంగ్ టైగర్’, అల్లు అర్జున్‌కి ‘ఐకాన్ స్టార్’, రవితేజకి ‘మాస్ మహారాజ్’, గోపీచంద్‌కి ‘మ్యాచో స్టార్’.. టాగ్‌లైన్ ఉంది. తాజాగా హీరో సుధీర్ బాబు ఖాతాలో కొత్త టాగ్‌లైన్ చేరింది.

సుధీర్ బాబుకి ఇప్పటివరకు ‘నైట్రో స్టార్’ అనే టాగ్‌లైన్ ఉంది. ‘హరోం హర’ సినిమా డైరెక్టర్ జ్ఞానసాగర్ ద్వారక.. సుధీర్ బాబుకి కొత్త టాగ్‌లైన్ పెడుతున్నామని, అది థియేటర్లలో చూడండని రిలీజ్ ముందు చెప్పారు. నేడు హరోం హర మూవీ రిలీజ్ అయింది. టైటిల్స్ సమయంలో ‘నవ దళపతి’ సుధీర్ బాబు అని పడింది. ఇక నుంచి సుధీర్ టాగ్‌లైన్ నవ దళపతి కానుంది. ఇటీవలే శర్వానంద్‌కి కూడా టాగ్‌లైన్ ఇచ్చారు. ‘చార్మింగ్ స్టార్’ అని శర్వాకి మనమే చిత్ర నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌ టాగ్‌లైన్ ఇచ్చారు.

Also Read: T20 World Cup 2024: టీ20‌ల్లో నికోలస్ పూరన్ చరిత్ర!

సూపర్ స్టార్ కృష్ణ అల్లుడిగా సుధీర్ బాబు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ‘ఏ మాయ చేశావే’లో కీలక పాత్ర చేసిన సుధీర్.. ‘శివ మనసులో శృతి’ హీరో అయ్యాడు. ప్రేమకథా చిత్రమ్, ఆడు మగాడ్రా బుజ్జీ, దొంగాట, కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ, మోసగాళ్లకు మోసగాడు, భలే మంచి రోజు, సమ్మోహనం, శ్రీదేవి సోడా సెంట‌ర్, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, హంట్, మామా మశ్చీంద్ర సినిమాలు చేశాడు. తాజాగా హరోం హర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

Show comments