గత కొద్ది రోజులుగా దేశ రాజధాని ఢిల్లీ తీవ్రమైన వేడితో అల్లాడిపోతుంది. ఇప్పటికే 52 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదైంది. ఇంకోవైపు నీటి సమస్యతో బాధపడుతోంది. మరికొన్ని రోజులు హీట్‌వేవ్ పరిస్థితులు ఉంటాయని కేంద్ర వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఇదిలా ఉంటే శనివారం మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉన్నట్టుండి తీవ్రమైన వేడి మధ్య దుమ్ము తుఫాన్ చెలరేగింది. ఆకస్మికంగా వాతావరణం చల్లబడింది. దీంతో ప్రజలు కాస్త ఉపశమనం పొందారు.
ఇది కూడా చదవండి: YouTube: యూట్యూబ్ లో మరోసారి సబ్‌స్క్రైబర్ల యుద్ధం.. ఎవరెవరి మధ్యో తెలుసా?
ఢిల్లీలో శనివారం మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఈదురుగాలులతో పాటు నగరమంతా ఆకాశం మేఘావృతమైంది. దీంతో గత ఐదు రోజులుగా తీవ్రమైన వేడిగాలులతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఊరట లభించింది. నగరంలో ధూళి తుఫాన్ లేదా ఉరుములతో కూడిన వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: Samantha: బాలీవుడ్ హీరో సరసన సమంత..
