NTV Telugu Site icon

Tummala Nageswara Rao : ఆయిల్ పామ్ సాగు , ఉద్యాన పంటలలో సూక్ష్మ సేద్యం కొరకు రాయితీలు

Tummala Nageswara Rao

Tummala Nageswara Rao

రాష్ట్రంలో పెరిగిన పంట మార్పిడి ఆవశ్యకత దృష్ట్యా, తెలంగాణ ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగు మరియు వివిధ ఉద్యాన పంటలలో సూక్ష్మ సేద్యం కొరకు రాయితీలు ఇస్తూ పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తుంది. 2023-24 సం.కి గాను 59,261 ఎకరాలు కొత్తగా ఆయిల్ పామ్ సాగులోకి తీసుకురావడం జరిగింది. 2023-24 సం.కి గాను ఆయిల్ పామ్ సాగు పధకం (NMEO-OP) కింద, కేంద్ర ప్రభుత్వం రూ.80.10 కోట్లను విడుదల చేయడం జరిగింది. దీనికి రూ.53.40 కోట్ల రాష్ట్ర వాటా కలుపుకుని మొత్తం రూ.133.50 కోట్లు విడుదల చేయుటకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా అనుమతులు ఇవ్వడం జరిగింది. ఈ మొత్తంలో 2023-24 సం.లో కేవలం రూ.32.72 కోట్లు మాత్రమే విడుదల చేయగా, వివిధ కారణాల చేత రూ.100.76 కోట్లు పెండింగ్ లో పెట్టడం జరిగింది. దీని వలన ఉద్యాన శాఖ, రైతులకు మరియు ఆయిల్ పామ్/ డ్రిప్ కంపెనీలకు, సకాలంలో బకాయిలు విడుదల చేయడం వీలుపడలేదు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవతో, ముఖ్యమంత్రి దృష్టిలోకి ఆయిల్ పామ్ రైతుల మరియు కంపెనీల ఇబ్బందులను తీసుకురాగ, పెండింగ్ లో వున్న రూ.100.76 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది.

ఈ మొత్తాన్ని 2-3 రోజులలో ఆయిల్ పామ్ తోటల నిర్వహణ మరియు అంతర పంటల సాగుకు సంబందించిన రాయితీలను, రైతుల ఖాతాలలో జమ చేయుటకు ఉద్యానశాఖ చర్యలు తీసుకోవడం జరుగుతున్నది. ఇదే విధంగా, 2022-23 సం. నుండి విడుదల కావలసివున్న సూక్ష్మ సేద్యానికి సంబందించి, రూ.55.36 కోట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. ఈ మొత్తాన్ని అయిల్ పామ్ మరియు ఇతర పంటలలో డ్రిప్ పరికరాలను రైతు పంట పొలంలో అమర్చిన సూక్ష్మ సేద్య కంపనీలకు పెండింగ్ లో ఊన్న బకాయిలుగాను విడుదల చేయడం జరిగింది. బకాయిలు విడుదలైనందువలన 2024-25 సంవత్సరానికి గాను నిర్ధేశించిన లక్ష్యాన్ని చేరుకొనేవిధంగా రైతులను ఆయిల్ పామ్ చేపట్టుటకు ప్రొత్సహించవలసిందిగా ఉద్యాన అధికారులను మంత్రి ఆదేశించడం జరిగింది.