ప్రభుత్వాఫీసుల్లో లంచగొండి అధికారులను ఏసీబీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ కొందరిలో మాత్రం మార్పు రావడం లేదు. వేలు, లక్షల్లో లంచాలు పుచ్చుకుంటూ ఏసీబీకి పట్టుబడుతున్నారు. లంచం ఇవ్వడం, తీసుకోవడం నేరమని అవగాహన కల్పించాల్సిందిపోయి కంచె చేను మేసినట్లుగా లంచాలకు తెగబడుతున్నారు కొందరు అధికారులు. తాజాగా తార్నాకలోని టీఎస్పీడీసీఎల్ కార్యాలయంలో లంచం తీసుకుంటూ ఏసిబికి రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు సుధాకర్ రెడ్డి. కొత్త ట్రాన్స్ఫర్మర్ కోసం కాంట్రాక్టర్ వద్ద రూ. 15000 డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో సబ్ ఇంజనీర్ సుధాకర్ రెడ్డిపై నిఘా పెట్టారు ఏసీబీ అధికారులు. లంచం తీసుకుంటున్న సమయంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
ACB: తార్నాకలో లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన సబ్ ఇంజనీర్ సుధాకర్ రెడ్డి
- తార్నాక లో లంచం తీసుకుంటూ
- ఏసీబీకి చిక్కిన సబ్ ఇంజనీర్ సుధాకర్ రెడ్డి

Acb