Site icon NTV Telugu

Su from So OTT : పెట్టిన బడ్జెట్ కి డబుల్ అడుగుతున్నారు!

Su From So

Su From So

కన్నడ స్టార్ యాక్టర్ రాజ్ బి శెట్టి నటిస్తూ నిర్మించిన Su from SO. సో కన్నడ నాట సెన్సేషన్ క్రియేట్ చేసింది. నాలుగున్నర కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందించిన ఈ సినిమా ఇప్పటివరకు 40 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి తమిళ రీమేక్ హక్కులు అమ్ముడయ్యాయి. తెలుగులో సినిమాని డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, పోటీలో ఈ సినిమా బాగా నడుస్తుందని భావించిన ఓటీటీ సంస్థలు తెలుగు ఓటీటీ రైట్స్ దక్కించుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం.

ALso Read:Arabia Kadali Review: అరేబియా కడలి రివ్యూ

అయితే రాజ్ బి శెట్టి అండ్ టీం తెలుగు డిజిటల్ ప్లస్ సాటిలైట్ రైట్స్ 9 కోట్లకు చేస్తున్నట్లుగా సమాచారం. నిజానికి ఈ సినిమా బడ్జెట్ 4.5 కోట్లు కానీ, తెలుగు సాటిలైట్ డిజిటల్ రైట్స్ నుంచి 9 కోట్లు రాబట్టాలని చూడడం చూస్తుంటే, పెట్టిన బడ్జెట్‌కి డబుల్ తెలుగు డిజిటల్ నుంచే రావడానికి ప్రయత్నిస్తున్నట్లు అర్థమవుతుంది. అయితే G5 సంస్థ ఈ సినిమాకి 6 కోట్లు వెచ్చించేందుకు సిద్ధమైంది. అయితే 9 కోట్లకు తగ్గమని ప్రస్తుతానికి టీం చెబుతున్నారు. ఈ సినిమాలో జేపీ స్వయంగా నటిస్తూ దర్శకత్వం వహించాడు. ఇక శనిల్ గౌతమ్ సహా ఇతర నటీనటులు కీలక పాత్రలలో నటించారు.

Exit mobile version