VD12 : విజయ్ నెక్ట్స్ సినిమాలో ఆ సీన్ మైండ్ బ్లోయింగ్ అట
- Follow Us :
-
-
Add as a preferred
source on google
VD12 : విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేక పరిచయాలు లేవు. ఈ ఏడాది ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించారు. బ్యూటీఫుల్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ నటించిన విషయం తెలిసిందే. యూత్ ఆడియన్స్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాను ఎంజాయ్ చేశారు. కానీ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది. సినిమాకు సంబంధించిన వసూళ్లు తీవ్రంగా నిరాశ పరచడంతో ఈ సారి హిట్ కొట్టాలని విజయ్ దేవరకొండ తదుపరి సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. చాలా కష్టపడుతున్నాడని ఆయన సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో ఒక సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా మిస్టర్ బచ్చన్‌లో నటించి మెప్పించిన ముద్దుగుమ్మ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా చేస్తోంది. తాజాగా మున్నార్‌లోని అందమైన లొకేషన్స్‌లో సినిమా చిత్రీకరణ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. స్టంట్స్ డైరెక్టర్ చేతన్ రాంషి డిసౌజా ఇటీవల ఒక చిట్‌చాట్ లో మాట్లాడుతూ.. ఈ సినిమాకు సంబంధించి అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేసినట్లుగా చెప్పుకొచ్చాడు. ఛాలెంజింగ్ యాక్షన్ సీక్వెన్స్‌లో విజయ్ దేవరకొండ కనిపించబోతున్నట్లుగా చేతన్ చెప్పుకొచ్చాడు.
Read Also:Dhoom 4 : ధూమ్ 4 అప్ డేట్.. ప్రియురాలు ఎవరు ? ఛేజ్ చేసేది ఎవరు ?
Also Read
- ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
- Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
- CM Chandrababu: రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం..!
- Nirmala Sitharaman: "మరో సంక్షోభం ముంచుకొస్తోంది".. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
విజయ్ దేవరకొండ కెరీర్లో ఇది బెస్ట్ సినిమాగా ఉంటుందని స్టంట్స్ డైరెక్టర్ చేతన్ పేర్కొన్నాడు. విజయ్ దేవరకొండకు జోడీగా నటిస్తున్న భాగ్యశ్రీ బోర్సే ఈ సినిమాతో బిజీ హీరోయిన్‌గా మారడం ఖాయం అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. గూఢచారి నేపథ్యంలో టాలీవుడ్ నుంచి రాబోతున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయమని మేకర్స్ ధీమాగా ఉన్నారు. నెట్టింట ఈ సినిమా గురించి అనేక పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇప్పటి వరకు టైటిల్ ప్రకటించని ఈ సినిమాకు ఎలాంటి టైటిల్ ను ఖరారు చేస్తారా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. విజయ్ దేవరకొండ ఈ సినిమాతో వచ్చే ఏడాది మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాకు తమిళ స్టార్ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నారు.
Read Also:Rebal Star : ‘స్పిరిట్’ లో ప్రభాస్ క్యారక్టర్ ఏంటో చెప్పేసిన సందీప్ రెడ్డి వంగా
తాజావార్తలు
-
Harish Rao: సామాన్యుడిపై ధరల భారం.. ప్రభుత్వం నిద్రమత్తులో ఉందా?
-
ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
-
Oppo F35, F35 Pro: ఒప్పో F35, F35 Pro భారత్‌లో లాంచ్.. రూ.38,999కే 8,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్!
-
Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
-
Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?