Komatireddy Venkat Reddy: విద్యాదానం గొప్పది.. చదవాలని మీకు కోరిక ఉంటే నేను చదివిస్తా… పేదరికం చదువుకు అడ్డం కాకూడదని భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం బొంగులూరు మోడల్ హైస్కూల్లో ఎంఎన్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 30 లక్షల రూపాయలను విలువచేసే స్టడీ మెటీరియల్ పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వం విద్యా వ్యవస్థను గాలికి వదిలేసిందని.. ఢిల్లీ ముఖ్యమంత్రిని మెచ్చుకోవడం కాదు.. తన కన్న చిన్న వయసున్న వ్యక్తి.. విద్యా వైద్యం ఉచితంగా ఇస్తున్నారు.. మరి మీరేం చేస్తున్నారని కేసీఆర్ ను ప్రశ్నించారు. ప్రభుత్వం విద్యా వైద్యాన్ని పూర్తిగా ఉచితంగా ఇచ్చినప్పుడే ప్రభుత్వం, ప్రజలు బాగున్నట్లు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తనకు మెసేజ్ చేస్తున్నారు.. ప్రాంతాలకు సంబంధం లేకుండా సేవ చేస్తున్నట్లు చెప్పారు.
Read Also: ICC ODI Team: ఐసీసీ వన్డే, టెస్టు టీమ్స్ ఇవే.. టీమిండియా నుంచి ముగ్గురికి చోటు
ప్రస్తుతం 38 మంది విద్యార్థులను ఎంబీబీఎస్ చదివిస్తున్నట్లు ప్రకటించారు. దళిత కుటుంబానికి చెందిన అమ్మాయి.. 2004 లో వ్యవసాయం చేస్తున్నట్టు ఓ టీవీలో వార్త వచ్చింది..వారి చెల్లాలను చదివిస్తా అని చెప్పా. డాక్టర్ చదువు పూర్తిచేసుకుని కార్డియాలిస్ట్ రోజూ ఇంటికి వచ్చి చెక్ చేస్తుంది. ఆమెను నేనే చదివిపించా… డబ్బు ఉన్నవారు పేదవారికి సహాయం చేయాలి. నల్లగొండ జిల్లాలో అన్ని కాలేజీలు తిరిగాను.. కోటి 20 లక్షలు పెట్టి కళాశాల్లో అభివృద్ధి పనులు చేయిస్తున్నాను. రేపే బోర్ వేయించి వాటర్ RO ఫలంట్ ఏర్పాటు చేయిస్తా. పదో తరగతిలో 9.5/10 వస్తే ఫౌండేషన్ ద్వారా 10 వేలు, 10/10 వస్తే పై చదువులకు ఐఐఐటి, ఎంబీబీఎస్ కోర్సుల్లో చదివేవారికి ప్రతి ఏటా రూ.25000 ఇస్తున్నానని కోమటిరెడ్డి చెప్పారు.
Read Also: Car Romance: కామా తురాణం.. కదులుతున్న కారులోనే రొమాన్స్