Teacher Transfer: ఉపాధ్యాయ వృత్తిలో చాలా మంది ఉంటారు.. కానీ, విద్యార్థులకు దగ్గరైన వాళ్లు కొందరే ఉంటారు.. ప్రతీ విద్యార్థి శక్తిని గుర్తించి.. వారి చదువు మెరుగుపర్చుకోవడానికి టీచర్ పెట్టే ఎఫెక్ట్ అంతా ఇంతా కాదు.. మరోవైపు.. మన పండగలు, సంప్రదాయాలు, ఇతరులతో నడుచుకునే విధానం.. పది మందిలో అనుసరించాల్సిన తీరు ఇలా.. విద్యార్థులకు విద్యా, బుద్ధులు నేర్పిస్తారు.. అయితే, ఉపాధ్యాయుడు, విద్యార్థుల మధ్య ఉండే అనుబంధానికి ప్రతీకగా నిలిచిన సంఘటన ఒకటి ఆంధ్రప్రదేశ్‌లో అందరి హృదయాలను కట్టిపడేసింది..
ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు అదనపు ఉపాధ్యాయుల బదిలీలు కొనసాగుతున్నాయి.. అందులో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం గౌడనహల్లి పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడు శివన్న కూడా బదిలీ అయ్యారు.. పిల్లలకు కేవలం చదువు చెప్పడమే కాదు వారి ఆప్యాయత అనురాగాలను చూరగొన్న శివన్న.. బదిలీ కావడంతో కన్నీటి పర్యంతమయ్యారు విద్యార్థినులు.. ఇక, విద్యార్థుల కంటతడి చూసి తాను కూడా బోరున ఏడ్చేశాడు శివన్న.. బదిలీపై వెళ్తున్న శివన్నకు వీడ్కోలు సమావేశం నిర్వహించారు.. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.. ఇక, ఆ తర్వాత విద్యార్థులంతా ఆ ఉపాధ్యాయుడిని పట్టుకుని కన్నీరు మున్నీరుగా విలిపించారు. విద్యార్థులు ఉపాధ్యాయుడి చుట్టు చేరి విలిపిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి..
విద్యార్థులు కన్నీరుమున్నీరవుతుంటూ.. వారిని సముదాయించే ప్రయత్నం చేస్తూనే.. తాను కూడా వెక్కివెక్కి ఏడ్చేశారు శివన్న.. విద్యార్థులు.. నన్ను ఓ తండ్రిగా భావించేవాళ్లు.. ఉపాధ్యాయుడిగా పాఠలతో పాటు.. మన సంస్కృతి, సంప్రదాయాలు, పండగల గురించి కూడా వారికి చెప్పేవాడిని.. వాళ్లను వదిలి వెళ్లడం నాకు కూడా బాధగా ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశారు టీచర్ శివన్న.
