Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Student Unions Demand Arrest Of Mohan Babu And Vishnu Cancellation Of Mbu Recognition

Mohan Babu University: మోహన్‌బాబు, విష్ణును అరెస్ట్ చేయండి.. MBU గుర్తింపు రద్దు చేయండి.. విద్యార్థి సంఘాల డిమాండ్

Published Date :February 4, 2026 , 8:44 am
By Sudhakar Ravula
Mohan Babu University: మోహన్‌బాబు, విష్ణును అరెస్ట్ చేయండి.. MBU గుర్తింపు రద్దు చేయండి.. విద్యార్థి సంఘాల డిమాండ్
  • Follow Us :
  • google news
  • dailyhunt

Mohan Babu University: మోహన్‌బాబు యూనివర్సిటీ (MBU)లో జరుగుతున్న అక్రమాలు, విద్యార్థులపై జరుగుతున్న దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఇవాళ తిరుపతిలో విద్యార్థి సంఘాలు భారీ నిరసనకు పిలుపునిచ్చాయి. ఎస్వీ యూనివర్సిటీ మెయిన్ గేట్ వద్ద ఈ నిరసన కార్యక్రమం జరగనుంది. SFI నాయకుల కిడ్నాప్ కేసులో మోహన్‌బాబు, విష్ణులను వెంటనే అరెస్ట్ చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.. విద్యార్థి నేతలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న కిడ్నాప్ రాజకీయాలు పూర్తిగా నశించాలంటూ గళం విప్పాయి. మోహన్‌బాబు యూనివర్సిటీ నిర్వహణలో తీవ్ర అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించిన విద్యార్థి సంఘాల నేతలు, MBUకి ఉన్న గుర్తింపును తక్షణమే రద్దు చేసి యూనివర్సిటీని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు.

Read Also: Ranveer vs Ranbir: ధురంధర్ హిట్‌ను జీర్ణించుకోలేకపోతున్నారా?.. రణవీర్‌ యాక్టింగ్‌పై నెట్టింట రచ్చ!

ఈ నిరసనకు SFI, AISF, NSUI, PDSU సంఘాలు ఐక్యంగా మద్దతు ప్రకటించాయి. విద్యార్థి ఉద్యమాలపై జరుగుతున్న దౌర్జన్యాలను ఇకపై సహించబోమని స్పష్టం చేస్తూ, ఐక్య కార్యాచరణతో పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇవాళ్టి నిరసనకు విద్యార్థులు, ప్రజాస్వామ్యవాదులు భారీగా తరలిరావాలని విద్యార్థి సంఘాల నేతలు విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల హక్కుల కోసం పోరాటం మరింత తీవ్రంగా కొనసాగుతుందని ప్రకటించారు. కాగా, మోహన్‌బాబు యూనివర్సిటీకి చెందిన సిబ్బంది ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి సంఘానికి చెందిన ఇద్దరు నేతలను కిడ్నాప్‌ చేయడం కలకలం సృష్టించిన విషయం విదితమే..

ఇక, ఈ ఘటనపై విద్యార్థి సంఘం నేత బండి చలపతి తిరుచానూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న వెంటనే పోలీసులు అప్రమత్తమై మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి కిడ్నాప్‌కు గురైన విద్యార్థులను వెతికే చర్యలు చేపట్టారు. అనంతరం కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్న వాహనాన్ని పోలీసులు చేజ్ చేసి అడ్డగించారు. ఈ సందర్భంగా కిడ్నాప్‌కు పాల్పడినట్లు భావిస్తున్న మోహన్ బాబు యూనివర్సిటీకి చెందిన బౌన్సర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే కిడ్నాప్‌కు గురైన విద్యార్థి సంఘం నేతలను పోలీసులు సురక్షితంగా రక్షించారు. విద్యార్థి సంఘం నేత బండి చలపతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నటుడు మోహన్ బాబు, మంచు విష్ణు యూనివర్సిటీకి చెందిన వీఆర్వో సతీష్‌తో పాటు మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ​నిందితులపై 191(2), 115(2), 140(1), 126(2), 351(2), r/w 190, 61(2) BNS సెక్షన్ల కింద క్రైం నెంబర్ (Cr. No. 23/2026) కేసు నమోదు అయ్యింది. ​ఈ కేసులో A1గా సతీష్, A2గా మోహన్ బాబు, A3గా మంచు విష్ణు బాబుపై కేసు నమోదు చేశారు. ​మొత్తంగా ప్రధాన నిందితులతో పాటు మరో 20 మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ​పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసుల గాలింపు ముమ్మరం చేపడుతున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • AISF NSUI PDSU SFI protest
  • Andhra Pradesh student politics
  • MBU controversies
  • MBU recognition cancellation
  • Mohan Babu arrest demand

తాజావార్తలు

  • Extramarital Affair: సంబంధానికి అడ్డు.. భర్తను గొంతు నులిమి చంపిన భార్య, ప్రియుడు!

  • Kitchen Tips: పాత గ్యాస్ స్టౌ కొత్తదానిలా మెరవాలా? అయితే ఈ అద్భుతమైన క్లీనింగ్ చిట్కా మీ కోసమే!

  • Shocking Murder: అన్నమయ్య జిల్లాలో హృదయ విదారక ఘటన.. రాత్రంతా అడవిలోనే, కన్న కొడుకు ముందే తండ్రిని..!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • Andhra Pradesh: ఏపీ వాసులకు గుడ్‌న్యూస్.. ఏప్రిల్ 28న ప్రారంభం..

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions