Site icon NTV Telugu

Tragedy : డాన్స్ చేస్తూ కుప్పకూలిన ఇంటర్‌ విద్యార్ధిని.. చివరికి

Dead Body Parcel West Godavari

Dead Body Parcel West Godavari

Tragedy : మహబూబాబాద్ జిల్లాలో డాన్స్ చేస్తూ విద్యార్ధిని మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. మహబూబాబాద్ జిల్లా సీరోల్ మండల కేంద్రంలోని ఏకలవ్య గురుకుల పాఠశాలలో సాంస్కృతిక కార్యక్రమం చేపట్టారు.ఈ సాంస్కృతిక కార్యక్రమంలో డ్యాన్స్ వేస్తూ రోజా అనే ఇంటర్ ఫస్టియర్ సీఈసీ విద్యార్ధిని కుప్పకూలింది.. వెంటనే స్పందించిన ఉపాధ్యాయులు చికిత్స నిమిత్తం మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.. చికిత్స పొందుతూ విద్యార్ధిని మృతి చెందినది.. విద్యార్ధిని స్వస్థలం మరిపెడ మండలం తానంచర్ల గ్రామ శివారు సపవత్ తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విద్యార్థి మృతి పట్ల ఎలాంటి విషయాలు బయటకు రాకుండా గోప్యంగా ఉంచుతున్నారు స్కూల్ యాజమాన్యం. పూర్తి విషయాలు తెలియాల్సి ఉంది.

Nara Lokesh: ఢిల్లీలో రెండో రోజు పర్యటనలో మంత్రి నారా లోకేష్.. పలువురు కేంద్ర మంత్రులతో సమావేశాలు

Exit mobile version