NTV Telugu Site icon

అర్ధరాత్రి నడిరోడ్డుపై కాలర్ ఎగరేస్తున్న శునకాలు.. ఎలానో తెలుసా..?

collor up chaitanya gondluri

collor up chaitanya gondluri

దేశంలో రోడ్లు రక్తమోడుతున్నాయి. రోజుకు ఎక్కడో ఒకచోట రోడ్డుప్రమాదంలో ఎంతోమంది మృత్యువాత పడుతున్నారు. అర్ధరాత్రి అపరాత్రి.. పగలు, సాయంత్రం అనేది ఏమి లేదు.. ప్రమాదాలకు.. ఇక ఆ ప్రమాదాలలో మనుషులతో పాటు అనేక మూగ జీవాలు కూడా ప్రాణాలను వదులుతున్నాయి. దేశంలో ఎక్కువగా జరిగే రోడ్డుప్రమాదాలు కేవలం వీధి కుక్కల వలనే జరుగుతూన్నాయని సర్వే తెలుపుతుంది. సడెన్ గా వచ్చిన విధి కుక్కలను తప్పించబోయి ప్రమాదల బారిన పడుతున్నారు.

ఇక ఇలాంటి ప్రమాదాలకు చెక్ పెట్టాడు హైదరాబాద్ కి చెందిన యువకుడు చైతన్య గొండ్లురి.. ప్లానెట్ గార్డియన్ అనే ఫౌండేషన్ ని స్థాపించి ‘కాలర్ అప్’ పేరిట వినూత్న కార్యక్రమానికి నాంది పలికాడు. దీనిద్వారా అర్ధరాత్రి జరిగే ప్రమాదాలను అరికట్టడానికి చిన్న ప్రయత్నం చేస్తున్నాడు. దీని గురించి చైతన్య మాట్లాడుతూ ” అర్ధరాత్రి ఎక్కువగా ప్రమాదాలు జంతువుల వలనే జరుగుతూన్నాయి.. మా ఎన్జీవో దానికి ఒక పరిష్కారం కనుగొన్నది.. మీరు తయారుచేసిన రిఫ్లెక్టీవ్ కాలర్ ని యానిమల్స్ కి ధరింప జేస్తున్నాము. వీటి వలన 100 కిలోమీటర్ల దూరం వరకు జంతువుల మెడలో ఉన్న కాలర్ మెరుస్తుంది. దీంతో అక్కడ ఒక యానిమల్ ఉందన్న విషయం డ్రైవర్స్ కి అర్ధమవుతుంది. దీంతో ప్రమాదాలను నివారించవచ్చు” అని చెప్పారు. ప్లానెట్ గార్డియన్ ఫౌండేషన్ కేవలం ఇది ఒక్కటే కాకుండా ముగా జీవాల ఆకలిని తీరుస్తోంది. రోడ్డుపక్కన వీధి కుక్కలను, ఆవులను అక్కున చేర్చుకుంటాయి. వాటి ఆకలిని తీరుస్తారు. హైదరాబాద్ వీధుల్లో  రిఫ్లెక్టివ్ కాల‌ర్స్ వేసుకొని శునకాలు తలెత్తుకొని తిరుగుతున్నాయి.