Site icon NTV Telugu

Street Vendor: ఈ పకోడీలు వద్దు బాబోయ్.. వేడి నూనెలో ఆయిల్ ప్యాకెట్లు ముంచుతున్న వీధివ్యాపారి (వీడియో)

Street Food

Street Food

స్ట్రీట్ ఫుడ్ తినేందుకు చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. బజ్జీలు, పకోడీ, బ్రెడ్ పకోడి వంటి వాటిని తింటుంటారు. స్ట్రీట్ ఫుడ్ కు డిమాండ్ పెరగడంతో వీది వ్యాపారులు దీన్ని ఆదాయ వనరుగా మలుచుకున్నారు. చిన్న స్టాల్ ఏర్పాటు చేసుకుని రుచికరమైన ఫుడ్ తయారు చేసి మంచి ఆదాయం పొందుతున్నారు. ఇదే తరహాలో ఓ వీది వ్యాపారి పకోడీలు చేస్తూ నెట్టింటా వైరల్ గా మారాడు. దీనికి కారణం అక్కడి పకోడీలు టేస్టీగానో, క్వాలిటీగానో ఉన్నాయనుకునేరు. ఆ వ్యాపారి చేస్తున్న పని తెలిస్తే షాక్ అవ్వకుండా ఉండలేరు. నూనే ప్యాకెట్స్ ను ఓపెన్ చేసేందుకు ఏకంగా వేడి నూనెలో ముంచాడు. ఆ నూనెతోనే పకోడీలు తయారు చేశాడు.

Also Read:Alapati Rajendra Prasad: శాతవాహన కళాశాల వివాదంలో ట్విస్ట్‌.. ఆలపాటి కీలక వ్యాఖ్యలు..

అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఈ తతాంగాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ గా మారింది. ఈ ఘటన లుథియానాలో చోటుచేసుకుంది. ఇది తెలిసిన నెటిజెన్స్ ఆ పకోడీలు మాకొద్దు బాబాయ్ అంటూ కామెంట్ చేస్తున్నారు. వీది వ్యాపారి తీరుపై ఆరోగ్య నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఓ వైపు కల్తీ ఆహార పదార్థాలతో బెంబేలెత్తుతుంటే.. ఆయిల్ ప్యాకెట్లను ఓపెన్ చేయడానికి వేడి నూనెలో ముంచడం.. దానితోనే పకోడీలు వేయించడంతో ఇంతకంటే ఘోరం ఇంకేమైనా ఉంటుందా అని ప్రశ్నిస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడడం ఏంటని మండిపడుతున్నారు. ఆ వ్యాపారి మాత్రం త‌న చ‌ర్యను స‌మ‌ర్థించుకున్నాడు.

Also Read:Hyderabad High Court: హైకోర్టులో ఒక్కసారిగా కుప్పకూలిన మరో లాయర్‌..!

వేడి నూనెలో ఆయిల్ ప్యాకెట్స్ ఈజీగా ఓపెన్ అవుతాయని చెప్పుకొచ్చాడు. వేడి నూనెలో ప్లాస్టిక్ క‌లుస్తుంద‌ని గ్రహించ‌కుండానే జ‌నం ఆ ప‌కోడీల‌ను తింటున్నట్లు నిపుణులు చెబుతున్నారు. క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి వారిపై ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ పకోడీలు మైక్రోప్లాస్టిక్ పకోడీల పేరుతో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. ఓ నెటిజన్ దీనిని సూపర్ హెల్తీ ఫుడ్ అని ఎగతాళి చేశాడు. మరొక నెటిజన్ కొత్త ప్లాస్టిక్ ఫ్లేవర్ పకోడీలు మార్కెట్లోకి వస్తున్నాయని సెటైర్ వేశాడు. మరొకరు దీనిని ఫాస్ట్ ఫుడ్ కు బదులుగా లాస్ట్ ఫుడ్ అని చెప్పుకొచ్చాడు.

Exit mobile version