Site icon NTV Telugu

Strange Tradition: మహాలక్ష్మి అమ్మవారికి నైవేద్యంగా మద్యం, మాంసం.. ఎక్కడో తెలుసా?

Mahalakshmi Ammavaru Korutla

Mahalakshmi Ammavaru Korutla

Mahalakshmi Offering Liquor, Meat in Korutla: ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ఆచారాలు ఉన్నాయి. అనాదిగా వస్తున్న ఆచారాలను సాంప్రదాయంగా ఇప్పటికీ పాటిస్తుంటారు. అయితే అందులో కొన్ని ఆచారాలు వింతగా అనిపిస్తాయి. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కొన్ని వించ ఆచారాలను ఇప్పటికీ పాటిస్తున్నారు. కర్నూలు జిల్లాలోని ఓ గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా పురుషులు స్త్రీ వేషధారణలో పాల్గొంటారు. ప్రకాశం జిల్లాలోని ఓ గ్రామంలో పెళ్లి సమయంలో వరుడు వధువుగా, వధువు వరుడిగా వేషాలు మార్చుకునే ఆచారం ఉంది. అలానే తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో ఓ వింత ఆచారం ఉంది.

జగిత్యాల జిల్లాలోని కోరుట్లలో సోమవంశ సహస్త్రర్జున క్షత్రియ సమాజ్ కులస్థులు వింత ఆచారంను పాటిస్తున్నారు. మహాలక్ష్మి అమ్మవారికి నైవేద్యంగా మద్యం, మాంసంను సమర్పిస్తారు. భజనలతో అమ్మవారి ఆలయం వరకు ర్యాలీ నిర్వహిస్తారు. ప్రతి ఏటా ఆషాడ మాస చివరి ఆదివారం ఇలా అమ్మవారికి పూజలు చేయడం అనాదిగా వస్తోంది. ఇక్కడ అమ్మవారికి బోనాలు సమర్పించడం ఆనవాయితీ. నిన్న ఆషాడ మాసంలో చివరి ఆదివారం కావడంతో.. క్షత్రియ సమాజ్ కులస్థులు మహాలక్ష్మి అమ్మవారికి బోనాలు సమర్పించారు. మద్యం, మాంసంను నైవేద్యంగా సమర్పించారు.

Also Read: Telangana Rains: నేడు, రేపు భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌!

మహాలక్ష్మి అమ్మవారికి మద్యం, మాంసం నైవేద్యంగా సమర్పించడాన్ని జనాలు వింతగా చూస్తున్నారు. సాధారణంగా మహాలక్ష్మి అమ్మవారికి మాంసంను నైవేద్యంగా సమర్పించరు. పాలు, పండ్లు, తీపి పదార్థాలను అమ్మవారికి నైవేద్యంగా పెడతారు. సోమవంశ సహస్త్రర్జున క్షత్రియ సమాజ్ కులస్థులు మాత్రం అమ్మవారికి మద్యం, మాంసం నైవేద్యంగా సమర్పిస్తున్నారు. అందుకే ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Exit mobile version