Site icon NTV Telugu

Theft: వింత దొంగతనం.. ఇంటి ముందున్న వ్యక్తిని, బైక్ ను తీసుకెళ్లిన యువకుడు.. తర్వాత బైక్ తో పరార్

Theft

Theft

ఆదిలాబాద్ జిల్లాలో వింత దొంగతనం చోటుచేసుకుంది. గుట్టు చప్పుడు కాకుండా దొంగతనాలకు పాల్పడుతుంటారు దుండగులు. కానీ ఓ యువ దొంగ మాత్రం యజమాని కళ్ల ముందే చోరీకి పాల్పడ్డాడు. ఇంటి ముందు ఉన్న వ్యక్తిని, బైక్ ను తీసుకెళ్లాడు ఓ యువకుడు. తర్వాత మద్యం తాగాక పట్టణంలోని పలు కాలనీలు అదే బైక్ పై తిప్పాడు. ఆ తర్వాత ఓ చోట బాధితుడిని దింపేసి బైక్ తో పరార్ అయ్యాడు యువదొంగ. మద్యం మత్తులోంచి తేరుకున్న బాధితుడు వన్ టౌన్ పోలీస్ లకు పిర్యాదు చేశాడు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీకెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.

Exit mobile version