NTV Telugu Site icon

US Storm: అమెరికాలో తుఫాన్ విధ్వంసం.. 22 మంది మృతి, అంధకారంలో 5 లక్షల మంది..!

Amrica

Amrica

Storm In US: అమెరికాలోని టెక్సాస్, ఓక్లహామా, ఆర్కన్సాస్‌లను భారీ తుఫాన్ కుదిపేస్తుంది. నాలుగు రాష్ట్రాల్లో తుఫాను కారణంగా 22 మంది మరణించడంతో పాటు వందలాది భవనాలు ధ్వంసమయ్యాయి. అర్కాన్సాస్‌లో ఎనిమిది మంది, టెక్సాస్‌లో ఏడుగురు, కెంటుకీలో నలుగురు, ఓక్లహోమాలో ఇద్దరు మరణించారు అని అధికారులు తెలిపారు. సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నందున మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.

Read Also: Ramcharan : ఆ తమిళ్ స్టార్ డైరెక్టర్ తో రాంచరణ్ మూవీ..?

కాగా,ఈ తుఫాను కారణంగా సోమవారం రాత్రి విద్యుత్ సేవలో అంతరాయంతో టెక్సాస్, కాన్సాస్, మిస్సౌరీ, అర్కాన్సాస్, టెన్నెస్సీ, కెంటుకీలలో నాలుగు లక్షల 70 వేల మందికి పైగా ప్రజలు విద్యుత్తు లేకుండా ఉండవలసిన పరిస్థితి ఏర్పాడింది. తుఫాన్ ధాటికి అనేక వాహనాలు కొట్టుకుపోయాయి. అలాగే, జార్జియా, సౌత్ కరోలినాలోని కొన్ని ప్రాంతాలు సోమవారం మధ్యాహ్నం వరకు తీవ్రమైన తుఫాన్ హెచ్చరికలో ఉన్నాయని నేషనల్ వెదర్ సర్వీస్ తెలిపింది. వాతావరణ సేవ కూడా ఒహియో, టేనస్సీ లోయలలో సుడిగాలి గురించి హెచ్చరికలు జారీ చేసింది. టోర్నడోల కారణంగా బలమైన గాలులు, బేస్‌బాల్‌లంత పెద్ద వడగళ్ళు, అలాగే కుండపోత వర్షాలు ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని తుఫాను అంచనా కేంద్రం వెల్లడించింది.