Fiona Storm: శుక్రవారం భారీ వర్షం, గాలులతో ఫియోనా తుఫాను అట్లాంటిక్ ద్వీపమైన బెర్ముడాను ముంచెత్తింది. ఇది తూర్పు కెనడా వైపు పయనించింది. ఇది కెనడియన్ చరిత్రలో అత్యంత తీవ్రమైన తుఫానులలో ఒకటిగా మారే ప్రమాదం ఉంది. ఫియోనా ఇప్పటికే వారం ప్రారంభంలో కరేబియన్ దీవుల శ్రేణిని దెబ్బతీసింది. కనీసం ఎనిమిది మంది ఈ తుఫాన్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. శక్తివంతమైన ఫియోనా తుఫాను వల్ల తూర్పు కెనడాలో హరికేన్ గాలులు బలంగా వీచాయి. దీనితో అక్కడి ప్రాంతాల్లోని చెట్లు, విద్యుత్ లైన్లు, గృహాలు దెబ్బతిన్నాయి. కొన్ని లక్షల మంది ఈ గాలుల వల్ల ప్రభావితమయ్యారు.
నోవా స్కోటియా, ప్రిన్స్ ఎడ్వర్డ్ ద్వీపంలో చెట్లు, విద్యుత్ లైన్లు నేలకూలినట్లు నివేదికలు వెల్లడించాయి.దాదాపు వారం రోజుల క్రితం ప్యూర్టో రికో, కరేబియన్‌లోని ఇతర ప్రాంతాలను దెబ్బతీసిన ఫియోనా.. కాన్సో, నోవా స్కోటియాలోని గైస్‌బరో మధ్య తుఫాన్ కేంద్రీకృతమై ఉంది. నోవా స్కోటియాలో దాదాపు 79 శాతం విద్యుత్ వినియోగదారులు అంటే 414,000 మంది విద్యుత్ లేకుండా ఉన్నారని తెలిసింది. ప్రిన్స్ ఎడ్వర్డ్ ద్వీపంలో 95శాతం ప్రజలు చీకట్లోనే ఉన్నారని విద్యుత్ సంస్థలు వెల్లడించారు. ఈ ప్రాంతంలోని రహదారులన్నీ మూసివేసినట్లు పోలీసులు వెల్లడించారు. తుఫాను ఉత్తర దిశగా పయనించే కొద్దీ కాస్త బలహీనపడింది. ఫియోనా నుంచి అధిక గాలులు, తుఫానులు, భారీ వర్షాలు కురుస్తాయని నిపుణులు అంచనా వేశారు. తుఫాను క్రమంగా బలహీనపడుతుందని అంచనా వేయబడింది, అయితే శనివారం మధ్యాహ్నం వరకు హరికేన్-ఫోర్స్ గాలులను కొనసాగించవచ్చని నేషనల్ హరికేన్ సెంటర్ తెలిపింది.
Ankita Bhandari Case: నన్ను వ్యభిచారిణిగా మార్చేందుకే.. హత్యకు ముందు చాటింగ్‌లో యువతి
కెనడియన్ అధికారులు నోవా స్కోటియా, ప్రిన్స్ ఎడ్వర్డ్ ద్వీపంలో అత్యవసర హెచ్చరికలను జారీ చేశారు. తీరప్రాంతాల వెంబడి తీవ్రమైన వరదలు, అత్యంత ప్రమాదకరమైన అలలు సంభవిస్తాయని హెచ్చరించారు. తీర ప్రాంతాల్లోని ప్రజలు ఖాళీ చేయాలని సూచించారు. 2003లో జువాన్ హరికేన్, 2019లో డోరియన్ హరికేన్ బెంచ్‌మార్క్‌ల కంటే ఈ తుఫాను మరింత భయంకరంగా ఉంటుందని కెనడియన్ హరికేన్ సెంటర్ వాతావరణ శాస్త్రవేత్త బాబ్ రాబిచాడ్ శుక్రవారం బ్రీఫింగ్‌లో తెలిపారు. దేశంలోని రెండు అతిపెద్ద క్యారియర్‌లు, ఎయిర్ కెనడా, వెస్ట్‌జెట్ ఎయిర్‌లైన్స్ శుక్రవారం సాయంత్రం నుండి ప్రాంతీయ సేవలను నిలిపివేసాయి.
