పంటను పండించడం అంటే చాలా కష్టం.. రైతులకు మాత్రమే సాధ్యం.. అందుకే రైతులను దేశానికీ వెన్నెముక అంటారు.. అయితే పంటను ఎంత కష్టపడి పండిస్తామో..సరైన పద్ధతులలో నిల్వచేయకుంటే మాత్రం తీవ్ర నష్టాన్ని చూడాల్సి వస్తుంది.. అయితే రైతులు ధాన్యాన్ని నిల్వ చెయ్యడంలో తగు జాగ్రత్తలు పాటించడం ద్వారా అధిక లాభాలను పొందవచ్చు..కోత కోసే సమయంలో ధాన్యంలో 24 శాతం తేమ ఉండేలా చూసుకోవాలి.. మార్కెట్ కు వచ్చే సమయానికి 10 శాతం ఉండేలా చూసుకోవాలి.. ధాన్యం నిల్వలో ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ధాన్యం నిల్వలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
*. కొత్త ధాన్యాన్ని, పాత ధాన్యాన్ని అసలు కలపకూడదు..
*. కొత్తగా తెచ్చిన సంచులలో ఫ్రెష్ ధాన్యాన్ని వెయ్యడం మంచిది..
*. ఈ సంచుల మీద 1లీ నీటికి 10మి.లీ మలాథియాన్ 5మి.లీ. డై క్లోరోవాన్ కలిపిన ద్రావణాన్ని పిచికారి చేసి ఆరనిచ్చి ధాన్యాన్ని నిల్వ చేయాలి..
*. ఒకవేళ పాత సంచులు వాడితే వాటిని వేడి నీటిలో ముంచి ఎండ బెట్టి వాడుకోవాలి..
*. ధాన్యం నింపిన బస్తాలను నేలకు, గోడలకు తగలకుండా తేమలేని పొడి ప్రదేశంలో చెక్క బల్లలమీద నిలువ చేయాలి.
*. ఎటువంటి పురుగులు చొరబడకుండా జాగ్రత్త తీసుకోవాలి..
*. 10మి.లీ మలాథియాన్ ఒక లీటర్ నీటిలో కలిపిన ద్రావణాన్ని ప్రతీ 100 చ.మీ 3 వంతున గోదాములలో ధాన్యం నిలువ చేసేముందు పిచికారి చేయాలి..
గోదాంలో నిల్వ చేస్తే..
*. గోదాములలో నిల్వ చేసిన ధాన్యం రక్షణకు టన్నుకు 3gr ఉండే అల్యూమినియం ఫాస్పైడ్ బిళ్ళలను 1 లేదా 2 ఉపయోగించాలి..
*. పురుగులు చనిపోయే మందులను గోదాంలలో పిచికారి చెయ్యాలి..
*. ఇథిలిన్ బ్రోమైడ్ ఒక క్వింటాళ్ళు ధాన్యానికి 5ml,1 క్వింటాలు అవరాలకు 3ml వాడి గాలి పోకుండా వారం రోజులు ఉంచాలి.. ఈ జాగ్రత్తలు పాటించి ధాన్యాన్ని నిల్వ చేస్తే ఎక్కువ రోజులు చెడిపోకుండా ఉంటుంది..