చైల్డ్ వెల్ఫేర్ కమిషన్ ఛైర్మన్ కోసలి అప్పారావు భ్రూణ హత్యలపై స్పందించారు. చెత్త కుండీలు కాలువలలో శివులను పడేయటం దుర్మార్గమని ఆయన పేర్కొన్నారు. విజయనగరంలో ఆయన మాట్లాడుతూ.. పిల్లలు వద్దనుకుంటే తమకి అప్పంగించ వచ్చని స్పష్టం చేశారు. చాలా వరకు అక్రమ సంబంధాల వలనే ఇలా పడేస్తున్నారని.. ఈవిషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. పిల్లలు లేనివారు చాలా మంది పిల్లలను దత్తత తీసుకునేందుకు తమకు దరఖాస్తు చేసుకుంటున్నారని తెలిపారు. దయచేసి ఇలా చెత్త కుండీలలో పడీయ వద్దని కోరారు. తమకు పిల్లలని అప్పగించాలని…అప్పగించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని వెల్లడించారు. పిల్లలపై తల్లుదండ్రుల పర్యవేక్షణ లోపం కనిపిస్తోందని ఆయన చెప్పారు.
పిల్లలు ఎలా ఉన్నారు.. ఎక్కడ తిరుగుతున్నారు.. అనే పర్యవేక్షణ తల్లిదండ్రులలో లోపిస్తుందని చైల్డ్ రైట్స్ కమిషన్ ఛైర్మన్ కేసలి అప్పారావు అన్నారు. అందుకే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని తెలిపారు. ఆసుపత్రి పరిధిలో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని చెప్పారు. వైద్యులు డెలివరీకి వచ్చిన వారి వివరాలను రికార్డ్ చెయ్యమని సూచిస్తున్నట్లు చెప్పారు. టీన్ ఏజ్ వాళ్లు ప్రేమ వ్యవహారాల కారణంగా అడ్వాన్స్ కావడంతో జరుగుతోందని ఉద్ఘాటించారు. రాష్ట్రంలో అన్ వాంటెడ్ ప్రెగ్నెన్సిలు చాలా నమోదయ్యాయన్నారు. అలాగే టీనేజ్ ఆడ మగ వాళ్లు డ్రగ్ వాడకం పేరిగిందని.. దీంతో విచ్చలవిడిగా వ్యవహరించడం జరుగుతోందన్నారు. కాగా ఈమధ్య రాష్ట్రంలో భ్రూణ హత్యలు పెరుగుతున్న నేపథ్యంలో చైల్డ్ వెల్ఫేర్ కమిషన్ ఛైర్మన్ కోసలి అప్పారావు స్పందించి ఈ వ్యాఖ్యలు చేశారు.
వాటిని నివారించేందుకు తమ కమిటీ కృషి చేస్తోందని పేర్కొన్నారు.