NTV Telugu Site icon

Viral Video : రాళ్లతో కారు.. వామ్మో ఏం క్రియేటివిటి బాసూ.. వీడియో వైరల్..

Stone Car

Stone Car

ఈ మధ్య సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి.. అందులో క్రియేటివిటితో వస్తున్న కొన్ని వీడియోలు మాత్రం జనాలను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.. తాజాగా ఓ కారు వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ వైరల్ అవుతుంది.. ఒక వ్యక్తి మాత్రం కాస్త కొత్తగా ఆలోచించి బండ రాళ్లను ఉపయోగించి అద్భుతమైన కారును తయారు చేశాడు..

ఆ కారును చూసిన ప్రతి ఒక్కరూ షాక్ అవుతూ తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఈ వెరైటీ కారు సోషల్ మీడియాలో లైకులు, షేర్లు, కామెంట్లతో బ్రేకులు లేకుండా దూసుకుపోతోంది.. టాలెంట్ అనేది ఎవరి సొత్తు కాదని ఓ వ్యక్తి నిరూపించాడు.. ముఖ్యంగా నిర్మాణ రంగంలో క్రియేటివ్‌గా కట్టిన భవనాలు, బంగ్లాలు మనం తరచుగా చూస్తూనే ఉంటాం.. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో కూడా అలాంటి ఒక అద్భుతాన్ని క్రియేట్ చేశారు..

మాములుగాగా భవనాలను రాళ్లతో నిర్మిస్తుంటారు.. కానీ కారును ఓ వ్యక్తి రాళ్లతో కట్టారు. దూరం నుంచి చూస్తే అది నిజంగా కారులానే కనిపిస్తుంది. ఎందుకంటే రాళ్లతో తయారు చేసిన ఈ కారులో టైర్ల నుంచి హెడ్ లైట్ల వరకు, అద్దాల నుంచి నంబర్ ప్లేట్ల వరకు అన్ని పర్ఫెక్ట్‌గా అమర్చాడు. అంతే కాదు, కిటికీలు వెనుక వైపు గ్లాస్‌ విండో కూడా నిజమైన కారులోని గాజులాగానే రాయితో తయారు చేశారు. అందుకే మార్గం మధ్యలో నిలబడిన ఈ కారు చాలా మందిని ఆకర్షిస్తూ ఉండటంతో ఆ వ్యక్తిలోని ఈ క్రియేటివిటీ ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతున్నాయి.. మీరు ఆ వీడియోను ఒక్కసారి చూడండి..