Site icon NTV Telugu

Stock Markets: నష్టాలతో స్టార్ట్ అయిన స్టాక్ మార్కెట్స్

Stock Markets

Stock Markets

స్టాక్ మార్కెట్లు ఇవాళ (గురువారం) నష్టాలతో ప్రారంభమయ్యాయి. వరుసగా మూడు రోజులు లాభాలను ఆర్జించిన సూచీలు ఇవాళ నష్టాల బాటలో పయనిస్తున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ బీఎస్ఈ సెన్సెక్స్ 120 పాయింట్లు కోల్పోయి 63 వేల 106 పాయింట్లకు దిగొచ్చింది. దేశీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 26 పాయింట్లు క్షీణించి 18 వేల730 పాయింట్లకు పడిపోయింది.

Also Read : Nithya Menen : ఆ హీరో నన్ను లైంగికంగా వేధించాడు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన నిత్యా మీనన్..!!

బజాజ్ ఆటో, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, దివిస్ ల్యాబ్స్, హీరో మోటో కార్ప్, సిప్లా, యూపీఎల్ షేర్లు లాభాల బాటలో పయనిస్తున్నాయి. ఇన్ఫోసిస్, ఓఎన్ జీసీ, ఇండస్ ఇండ్ బ్యాంక్ టీసీఎస్ షేర్లు మాత్రం నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్, టీసీఎస్, యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్, ఆపోలో హాస్పిటల్స్ షేర్లు మోస్ట్ యాక్టివ్ గా ఉన్నాయి.

Also Read : Nagercoil Case: నాగర్‌కోయిల్ కేసు నిందితుడు కాశీకి జీవిత ఖైదు

అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాలు మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. అలాగే ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచినప్పటికీ ద్రవ్యోల్పణాన్ని స్థిరంగా ఉంచేందుకు కీలక రేట్లను 50 బేసిస్ పాయింట్లు పెంచుతామనే సంకేతాలు ఇన్వెస్టర్లలో ఆందోళన కలిగిస్తుంది. పాలసీ రేట్లపై అనిశ్చితి నెలకొని ఉండటంతో మదుపర్లు ఆచూతూచి వ్యవహరిస్తున్నారు. ఈ రోజు ఇంట్రా డే ఒడుదొడుకుల్లో సాగే సూచనలు కన్పిస్తున్నాయి.

Also Read : Fake constable: పోలీస్ అని నమ్మించింది.. ముగురిని ప్రేమలో ముంచింది

కాగా డాలర్ తో పోల్చితే రూపాయి మారకం విలువ క్షీణించింది. బుధవారం మార్కెట్ ముగిసే సమయానికి రూ. 82.10 గా రూపాయి విలువ ఇవాళ ఉదయం సెషన్ లో రూ.82.16 వద్ద ట్రేడ్ అవుతోంది. నిన్నటితో పోల్చేతే 6 పైసలు పెరిగింది. కాగా బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ 47.44 లక్షల ఈక్విటీ షేర్లను లేదా 4.5 శాతం సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్‌ వాటాను ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా ఒక్కో షేరు సగటు ధర రూ. 985.98తో రూ. 467.74 కోట్లకు విక్రయించింది.

Exit mobile version