NTV Telugu Site icon

Stock Markets: భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్స్.. లాభాల స్వీకరణకు ఇన్వెస్టర్ల మొగ్గు..

Loss Huge

Loss Huge

దేశీయ స్టాక్ మార్కెట్ లో మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో మంగళవారం స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిసాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ యొక్క ద్రవ్య విధాన సమావేశం తరువాత, పెట్టుబడిదారులు లాభాలను పొందేందుకు విక్రయించడానికి ఇష్టపడగా.. బీఎస్‌ఈ సెన్సెక్స్ ఇంట్రాడేలో 7,511.39 పాయింట్ల గరిష్టాన్ని తాకి, చివరకి 188.50 పాయింట్ల నష్టంతో 74,482.35 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక మరోవైపు ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కూడా 22,783.35 పాయింట్ల గరిష్ఠ స్థాయిని చేరుకొని చివరకు 38.55 పాయింట్లు నష్టపోయి 22,603.85 పాయింట్ల వద్ద ముగిసింది.

Also Read: Panipuri 333: ఇలా ఐతే కష్టమే బ్రో.. ఒక్క ప్లేట్ పానీపూరి రూ. 333.. ఎక్కడంటే..

ఇక నేడు ఇంట్రాడేలో బీఎస్‌ఈ లో మహీంద్రా అండ్ మహీంద్రా, పవర్‌గ్రిడ్, ఇండస్ ఇండస్ బ్యాంక్ భారీగా పుంజుకోగా, టెక్ మహీంద్రా, టాటా స్టీల్ భారీ నష్టాలతో ముగియగా.. మరోవైపు ఎన్‌ఎస్‌ఈ లో శ్రీరామ్ ఫైనాన్స్, పవర్ గ్రిడ్ భారీగా పెరగగా, టాటా స్టీల్, టెక్ మహీంద్రా వంటి షేర్లు పతనమయ్యాయి.

Also Read: Earthquake: బంగాళాఖాతంలో భూకంపం.. రిక్టర్ స్కేల్ పై..

అలాగే మిడ్ క్యాప్ నిఫ్టీ ధరలు 0.07% పెరగగా, స్మాల్ క్యాప్ ధరలు 0.04% తగ్గాయి. నిఫ్టీ ఆటో 1.82% పైగా లాభపడగా, నిఫ్టీ రియల్ ఎస్టేట్ 1.45% లాభపడింది.

Show comments