Site icon NTV Telugu

Stock Market: పాలసీ రేట్ల ప్రకటనకు ముందు.. కొత్త రికార్డు నెలకొల్పిన సెన్సెక్స్

Bse,nse,stock Market Opening,stocks,nifty,sensex,

Bse,nse,stock Market Opening,stocks,nifty,sensex,

Stock Market: ఆర్‌బీఐ పాలసీ రేట్లు ప్రకటించకముందే సెన్సెక్స్ మరో చరిత్ర సృష్టించింది. ఈరోజు సెన్సెక్స్ 69888.33 గరిష్ట స్థాయికి చేరుకోగా, నిఫ్టీ 21000 దాటింది. డిసెంబర్ 4, 2023న, సెన్సెక్స్ 68918 వద్ద సరికొత్త ఆల్-టైమ్ గరిష్టాన్ని నమోదు చేసింది. ఈ రికార్డు డిసెంబర్ 5న అంటే ఆ మరుసటి రోజే బద్దలైంది. సెన్సెక్స్ సరికొత్త ఆల్ టైమ్ గరిష్ట స్థాయి 69381కి చేరుకుంది. డిసెంబర్ 6న మరోసారి 69,744.62 వద్ద ఆల్ టైమ్ హైని నమోదు చేసింది. ఆర్‌బీఐ మానిటరీ పాలసీ ప్రకటించకముందే స్టాక్ మార్కెట్ మరోసారి ట్రాక్‌లోకి వచ్చింది. సెన్సెక్స్ 144 పాయింట్ల లాభంతో 69666 వద్ద, నిఫ్టీ 32 పాయింట్ల లాభంతో 20934 వద్ద ట్రేడింగ్ ప్రారంభించాయి. గురువారం వరుసగా 7 ట్రేడింగ్ సెషన్‌ల పెరుగుదల తర్వాత, మార్కెట్ మొమెంటం ఆగిపోయింది.

ప్రారంభ ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 120 పాయింట్ల లాభంతో 69642 స్థాయిలో ట్రేడవుతుండగా, నిఫ్టీ కూడా 43 పాయింట్లు పెరిగింది. నిఫ్టీలో ఎల్‌టీఐ మైండ్‌ట్రీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హెచ్‌సీఎల్ టెక్, యూపీఎల్, విప్రో టాప్ గెయినర్లు కాగా, దివీస్ ల్యాబ్, ఐసీఐసీఐ బ్యాంక్, డాక్టర్ రెడ్డి, భారతీ ఎయిర్‌టెల్, కోటక్ మహీంద్రా బ్యాంక్ టాప్ లూజర్లుగా ఉన్నాయి.

Read Also:KCR: కేసీఆర్‌ త్వరలోనే కోలుకుంటారు.. పీఎం మోడీ, ఎమ్మెల్సీ కవిత ట్వీట్‌

అదానీ షేర్ల మిశ్రమ పనితీరు: ప్రారంభ ట్రేడ్‌లో దాదాపు 0.42 శాతం బలహీనతతో అదానీ పవర్ రూ. 560.05 వద్ద ఉంది. అదానీ ఎంటర్‌ప్రైజెస్ 0.11 శాతం పెరిగి 2890.45 వద్ద ఉంది. అదానీ విల్మార్ 1.26 శాతం క్షీణించి రూ.390.60 వద్ద ఉంది. కాగా, ఈరోజు కూడా అదానీ టోటల్ గ్యాస్ 6 శాతం పెరిగి రూ.1228 వద్ద, అదానీ గ్రీన్ ఎనర్జీ 2.03 శాతం తగ్గి రూ.1591.10 వద్ద ఉన్నాయి. ప్రారంభ ట్రేడింగ్‌లో అదానీ ఎనర్జీ సొల్యూషన్ 1.56 శాతం క్షీణించి రూ.1180 వద్ద ఉంది. మరోవైపు ఈరోజు ఏసీసీ, అంబుజా సిమెంట్, ఎన్డీటీవీలు నష్టాల్లో ఉన్నాయి.

గురువారం అమెరికా స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగియగా, దేశీయ మార్కెట్లు క్షీణతతో ముగిశాయి. S&P 500 గురువారం 0.8శాతం పెరిగి 4,585.59కి చేరుకుంది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 0.2శాతం పెరిగి 36,117.38కి చేరుకుంది. నాస్‌డాక్ కాంపోజిట్ 193.28 లేదా 1.4శాతం జంప్ చేసి 14,339.99 వద్దకు చేరుకుంది. అంతకుముందు భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీ సెన్సెక్స్ 0.19 శాతం క్షీణతతో 69,521.69 పాయింట్ల వద్ద ముగిసింది. ట్రేడింగ్‌లో 69,320.53 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. నిఫ్టీ కూడా 36.55 పాయింట్ల పతనంతో 20,901.15 పాయింట్ల వద్ద ముగిసింది.

Read Also:Rajasthan: రాజస్థాన్‌ ముఖ్యమంత్రి పదవి ఎవరిని వరించనుంది..? రిసార్ట్‌లో బందీగా ఎమ్మెల్యే కుమారుడు

Exit mobile version