NTV Telugu Site icon

Bus Accident: రోడ్డుపై గింగిరాలు తిరిగిన బస్సు.. 9 మంది మృతి

Bus Accident

Bus Accident

Bus Accident: మహారాష్ట్రలోని గోండియా – కొహ్మారా మధ్యలోని రహదారిపై ఖజ్రీ గ్రామ సమీపంలో ఈ బస్సు ప్రమాదం జరిగింది. ఈ బస్సు ప్రమాదంలో 9 మంది మృతి చెందినట్లు నిర్ధారించారు అధికారులు. అయితే ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. అందిన సమాచారం మేరకు భండారా నుంచి సకోలి లఖానీ మీదుగా గోండియా వైపు వెళ్తున్న శివషాహి బస్సుకు అకస్మాత్తుగా బైక్ ఎదురుగా వచ్చింది. బైక్‌ రైడర్ ను కాపాడే ప్రయత్నంలో బస్సు డ్రైవర్‌ బస్సును తీవ్రంగా కట్‌ చేయడంతో బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డుపై బోల్తా గింగిరాలు తిరిగింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో దాదాపు 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనలో ప్రస్తుతానికి 9 మంది ప్రయాణికులు మృతి చెందగా, పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి.

Also read: Vikatakavi: వెబ్ సిరీస్‌కు వ‌ర్క్ చేయ‌టం ఓ డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్ : జోశ్యుల‌ గాయ‌త్రి

ప్రమాద స్థలంలో ఉన్న ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. బస్సు డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడని తెలిపారు. ఈ ఘటనపై బాటసారులు పోలీసులకు, అంబులెన్స్‌కు సమాచారం అందించారు. దీంతో పోలీసులు, అంబులెన్స్‌ విభాగాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఇక బస్సు ప్రమాదం జరిగిన వెంటనే ఆ ప్రాంతంలో గందరగోళం నెలకొంది. చుట్టుపక్కల వారు ఘటనా స్థలానికి చేరుకుని అనేకమంది క్షతగాత్రులను రక్షించారు. బస్సు బోల్తా పడిన తర్వాత క్షతగాత్రులను, ఇతర వ్యక్తులను తరలించే పనులు ప్రారంభించారు. ఇక ఘటనలో గాయపడిన వారిని చికిత్స కోసం గోండియా జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం తర్వాత శివషాహి బస్సును క్రేన్ సాయంతో పైకి లేపారు. ఇక ఈ ఘటనపై రాష్ట్ర తాత్కాలిక డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. ప్రమాద ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని అడ్మినిస్ట్రేటివ్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను సమన్వయం చేస్తున్నారు.

Also read: Air India Black Friday: నేటి నుంచే ఎయిర్ ఇండియా బ్లాక్ ఫ్రైడే సేల్ ప్రారంభం.. టికెట్స్ బుకింగ్ పై తగ్గింపు