Site icon NTV Telugu

CM Revanth Reddy: ప్రభుత్వ పాఠశాలల్లో అధునాతన ఎడ్​ టెక్​ సదుపాయాలు..

Cm Revanth

Cm Revanth

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో ప్రముఖ NGO సంస్థలతో రాష్ట్ర విద్యాశాఖ MOU కుదుర్చుకుంది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అత్యాధునిక సాంకేతిక బోధన సేవలను ఉచితంగా అందించాలన్న లక్ష్యంతో MOU కుదుర్చుకుంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన ఆరు ప్రముఖ సంస్థల భాగస్వామ్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో అధునాతన ఎడ్​ టెక్​ సదుపాయాలను అందించనున్నది తెలంగాణ ప్రభుత్వం. ఇందుకు నందన్ నీలేకణి నేతృత్వంలోని ఎక్‌స్టెప్ ఫౌండేషన్, డాక్టర్ సునీతా కృష్ణన్ నేతృత్వంలోని ప్రజ్వల ఫౌండేషన్, అలక్​ పాండే అధ్వర్యంలోని ఫిజిక్స్ వాలా, ఖాన్ అకాడమీ, షోయబ్​దార్​ నిర్వహిస్తున్న పైజామ్ పౌండేషన్, సఫీనా హుస్సేన్​ అధ్వర్యంలోని ఎడ్యుకేట్ గర్ల్స్ లాంటి పేరొందిన సంస్థలతో ఈరోజు MOU కుదుర్చుకుంది.

Also Read:Upcoming Smartphones: ఈ రెండు చౌకైన 5G ఫోన్‌లు వచ్చే వారం విడుదల.. కేక పుట్టించే ఫీచర్లు

దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పేరొందిన సంస్థల భాగస్వామ్యంతో రాష్ట్ర విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావచ్చని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో విద్యా నాణ్యత ప్రమాణాలను మెరుగుపరచాలన్న ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకుంది. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు, పథకాలకు ఆకర్షితులై రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకు వస్తున్నాయి వివిధ సంస్థలు. నందన్ నీలేకణి నేతృత్వంలోని ఎక్‌స్టెప్ ఫౌండేషన్ కృత్రిమ మేథ ఆధారిత ప్లాట్‌ ఫారమ్‌తో 540 పాఠశాలలలో పని చేస్తుంది. ఇకపై 33 జిల్లాల పరిధిలో 5,000కి పైగా ప్రాథమిక పాఠశాలలకు విస్తరించనుంది. మూడో తరగతి నుంచి 5వ తరగతి వరకు తెలుగు, ఇంగ్లిష్​ భాషలతో పాటు మ్యాథ్స్​ బేసిక్స్ ను ఈ సంస్థ అందిస్తుంది.

Also Read:Bhumana Karunakar Reddy: ఏడాది కాలంగా అక్రమ కేసులు, అరెస్టులు తప్ప ఏం జరిగింది? భూమన ఫైర్..

ఫిజిక్స్ వాలా ఇంటర్​ విద్యార్థులను నీట్​, జేఈఈ, క్లాట్​ పరీక్షలకు సన్నద్ధులను చేస్తుంది. పాఠశాల స్థాయి నుంచే పోటీ పరీక్షల దృక్కోణంలో విద్యార్థులకు ఉచిత శిక్షణ అందిస్తుంది. ఖాన్ అకాడమీ రాష్ట్రంలో 6వ తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులకు పాఠ్యాంశాలకు అనుగుణంగా వీడియో ఆధారిత STEM (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్) శిక్షణను అందజేస్తుంది. డాక్టర్ సునీతా కృష్ణన్ నేతృత్వంలో ప్రజ్వల ఫౌండేషన్ 6వ తరగతి నుంచి క్లాస్​ 12 వరకు విద్యార్థులకు రాష్ట్రవ్యాప్తంగా బాల సురక్ష, రక్షణ కార్యక్రమాలు ప్రారంభిస్తుంది. పై జామ్ ఫౌండేషన్ ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు కోడింగ్ మరియు కంప్యూటేషనల్ థింకింగ్ పై శిక్షణను అందిస్తుంది. ఎడ్యుకేట్ గర్ల్స్ సంస్థ రాష్ట్రంలో పాఠశాలలకు దూరంగా ఉన్న 16 వేలకు పైగా పిల్లలను తిరిగి బడిలో చేర్పించటంతో పాటు, బాలికల అక్షరాస్యత, విద్యా అవకాశాలను మెరుగుపరుస్తుంది.

Also Read:Bhumana Karunakar Reddy: ఏడాది కాలంగా అక్రమ కేసులు, అరెస్టులు తప్ప ఏం జరిగింది? భూమన ఫైర్..

తెలంగాణ విద్యా విభాగం – ఎడ్‌టెక్ ఒప్పందాలు

1. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో రాష్ట్ర విద్యాశాఖ 6 ప్రముఖ NGO సంస్థలతో MOUలు కుదుర్చుకుంది.
2. లక్ష్యం: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా అత్యాధునిక సాంకేతిక బోధన సేవలు అందించటం.
3. భాగస్వాములు: ఎక్‌స్టెప్ ఫౌండేషన్, ప్రజ్వల ఫౌండేషన్, ఫిజిక్స్ వాలా, ఖాన్ అకాడమీ, పైజామ్ ఫౌండేషన్, ఎడ్యుకేట్ గర్ల్స్.
4. ఎక్‌స్టెప్ ఫౌండేషన్ (నందన్ నీలేకణి నేతృత్వంలో): 540 పాఠశాలల నుంచి 33 జిల్లాల్లో 5,000+ పాఠశాలలకు విస్తరణ. 3-5 తరగతులకు తెలుగు, ఇంగ్లిష్, మ్యాథ్స్ బేసిక్స్.
5. ఫిజిక్స్ వాలా: ఇంటర్ విద్యార్థులకు NEET, JEE, CLAT ఉచిత శిక్షణ. పాఠశాల స్థాయిలో నుంచే పోటీ పరీక్షల సంసిద్ధత.
6. ఖాన్ అకాడమీ: 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు STEM వీడియో శిక్షణ.
7. ప్రజ్వల ఫౌండేషన్: బాలల భద్రత, రక్షణపై 6వ తరగతి నుంచి క్లాస్ 12 వరకు విద్యార్థుల కోసం కార్యక్రమాలు.
8. పైజామ్ ఫౌండేషన్: 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కోడింగ్, కంప్యూటేషనల్ థింకింగ్ శిక్షణ.
9. ఎడ్యుకేట్ గర్ల్స్: స్కూల్‌కి దూరంగా ఉన్న 16,000+ పిల్లలను తిరిగి స్కూల్‌కు చేర్పించటం, బాలికల అక్షరాస్యత పెంపొందించడం.
10. విద్యా రంగంలో విప్లవాత్మక మార్పుల దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు.
11. కార్యక్రమంలో విద్యా శాఖ ముఖ్యాధికారులు, NGO ప్రతినిధులు పాల్గొన్నారు.

Exit mobile version