State Bank of India: ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన ఖాతాదారులకు షాకిచ్చింది… నిధుల సమీకరణ వ్యయ ఆధారిత (ఎంసీఎల్‌ఆర్) రుణ రేటును పెంచేసింది.. అన్ని కాలపరిమితులపై స్వల్పంగా అంటే.. 5 బేసిస్ పాయింట్ల మేర పెంచుతున్నట్టు ప్రకటించింది.. పెంచిన వడ్డీ రేట్లు నేటి నుంచి అంటే జులై 15వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి.. ఈ పెరుగుదలతో, MCLRపై రుణాలు పొందిన రుణగ్రహీతలకు ఈఎంఐల భారం మరింత పెరగనుంది.. ఇతర బెంచ్‌మార్క్‌లతో రుణాలు అనుసంధానించబడిన వారికి ఇది వర్తించదు..
Read Also: Ashwin-Harbhajan: హర్భజన్ సింగ్ రికార్డు బ్రేక్ చేసిన అశ్విన్.. ఇక అనిల్ కుంబ్లే టార్గెట్!
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేర్కొన్న ప్రకారం.. ఎంసీఎల్‌ఆర్ ఆధారిత రుణ రేట్లు 8 శాతం నుంచి 8.75 శాతం శ్రేణిలో ఉన్నాయి. ఎంసీఎల్‌ఆర్ అనేది ఒక బ్యాంకు వినియోగదారులకు ఇచ్చే రుణాల ప్రాథమిక కనీస రేటు.. ఇక, ఎస్బీఐ తాజా నిర్ణయంతో.. ఏడాది కాలపరిమితి కలిగిన రుణాల రేటు 8.50 శాతం నుంచి 8.55 శాతానికి పెరగనుండగా.. ఓవర్‌నైట్ రేటు 8 శాతంగా ఉంటుంది. నెల, మూడు నెలల రేటు 8.15 శాతం చొప్పున అమలు చేయనున్నారు.. ఆరు నెలల ఎంసీఎల్‌ఆర్ రేటు 8.45 శాతంగా ఉండగా.. రెండేళ్ల ఎంసీఎల్‌ఆర్ రేటు 8.65 శాతానికి చేరింది.. ఇక, మూడేళ్ల రేటు 8.75 శాతంగా ఉంటుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేర్కొంది.
