సరిసాటిలేని సౌందర్యానికి కూడా కొత్త అందాలు తెచ్చే ‘ఇల్బుమినా’ అనే ఒక అపూర్వమైన విభాగానికి తెలంగాణా రాష్ట్ర పోలీస్ శాఖ, మహిళా భద్రతా విభాగం డిఐజి – శ్రీమతి సుమతి బడుగుల – ఈనాడే హైదరాబాద్లోని నానక్ రామ్ గూడా స్టార్ హాస్పిటల్స్ లో శుభారంభం చేశారు. స్టార్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డా. గోపీచంద్ మన్నం, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డా. రమేష్ గూడపాటి సమక్షంలో జరిగిన ఈ ప్రారంభోత్సవానికి సీఐఐ ఐవిఎన్ ఛైర్ పెర్సన్ శ్రీ విద్యారెడ్డి, సుప్రసిద్ధ ఫ్యాషన్ ఐకాన్, అందాలసుందరి శిల్పారెడ్డి హాజరయ్యారు.
Read Also: Andhra Pradesh: విద్యారంగంలో గేమ్ ఛేంజర్.. ‘ఎడెక్స్’తో ఏపీ సర్కార్ కీలక ఒప్పందం
మనదేశంలో, మరీ ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఇంత విస్తృతమైన స్థాయిలో, ఆత్మవిశ్వాసాన్ని అత్యధికం చేయగల విధంగా ఇన్ని అధునాతన అవకాశాలను అందుబాటులోకి తెచ్చినందుకు స్టార్ హాస్పిటల్స్ యాజమాన్యాన్ని అతిథులు పదేపదే ప్రశంసించారు. ఫేస్ నుంచి బ్రెస్ట్ రిడక్షన్ ఆగ్మెంటేషన్ బాడీ కాంటూరింగ్, రీకన్ స్ట్రక్టీవ్ సర్జరీ, హ్యాండ్ సర్జరీ, బర్న్స్, ట్రామా, కంజెనిటల్, ఇన్ఫెక్టిన్, పోస్ట్-బెరియాట్రిక్ ట్రీట్మెంట్స్, సర్జరీలతోబాటు నాన్-సర్జికల్ చికిత్సలనూ పొందాలంటే – గతంలో యూరోప్, అమెరికా వంటి విదేశాలకే వెళ్లవలసివచ్చేది. సౌందర్యరక్షణ, పోషణలతోబాటు ఆత్మవిశ్వాసాన్ని ద్విగుణీకృతం చేసే ఇంత అత్యావశ్యకమైన అవకాశాలను నేరుగా అందరి చేరువకే చేర్చినందుకు స్టార్ హాస్పిటల్స్ యాజమాన్యం: ముందుచూపును వక్తలు అభినందించారు. ‘ఇల్యుమినా’కు వచ్చి ఇనుమడించిన అందాలతో బయటకు వెళ్లగలగటం – అతివలకే కాదు, పురుషులకూ అవశ్యమని వారు స్పష్టం చేశారు.
Read Also: TS Raj Bhavan: బిల్లుల ఆమోదంపై క్లారిటీ ఇచ్చిన రాజ్ భవన్
స్టార్ హాస్పిటల్స్ లోని ‘ఇల్యుమినా’ ప్రారంభంవల్ల – క్లినికల్ కాస్మెటాలజీ, క్లినికల్ డెర్మటాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, రీకన్ స్ట్రక్టీవ్ సర్జరీ, విభాగాలలో సరికొత్త అధ్యాయం ఆరంభం అయిందని పలువురు పేర్కొన్నారు. ఈ ‘ఇల్యుమినా’ ప్రారంభోత్సవ సమయంలో వివిధ పరికరాలు, సామగ్రిని పరిశీలించటంతోబాటు – అందరి సమక్షంలోనూ ‘ఇల్యుమినా కాఫీ టేబుల్ బుక్’ను కూడా శ్రీమతి సుమతి బడుగుల ఆవిష్కరించారు. ‘ఇల్యుమినా’లో ఉన్న ఆధునిక పరికరాలు, వాటి సాయంతో ఇక్కడ లభించే విభిన్న చికిత్సలు, ట్రీట్ మెంట్లు, సర్జరీల వివరాలు అన్నీ ఈ కాఫీ టేబుల్ బుక్లో సాధికారికంగా, సచిత్రంగా పొందుపరిచారనేది విశేషం.
Read Also: Fire Accident: బరేలీలోని SBI మెయిన్ బ్రాంచ్‌లో మంటలు.. అందరూ సురక్షితం
అధునాతన వైద్యచికిత్సావిధానాలకు ఆటపట్టులాంటి స్టార్ హాస్పిటల్స్, నానక్ రామ్ గూడాలోని ‘ఇల్యుమినా’ విభాగాన్ని సందర్శించినవారికి అన్నిరకాల సౌందర్య సంబంధిత మెరుగు అవకాశాలకు వీలుందనీ, దానితో వారి ఆత్మవిశ్వాసం రెట్టింపు అయితీరుతుందనీ ఈ విభాగాధిపతులు స్పష్టం చేశారు. గతంలో కన్నా పురుషులకు కూడా సౌందర్య సంబంధిత అవసరాలు పెరిగాయనీ, వారికి కూడా తగినన్ని ఆధునిక సదుపాయాలను తాము సమకూర్చామనీ, వాస్తవానికి కొత్తతరం యువతులు, మహిళలతో పాటు పురుషులు కూడా ‘ఇల్యుమినా’ను తప్పక సందర్శించాల్సిన అవసరం ఉందనీ విభాధిపతి డా. రాజేష్ వాసు వ్యాఖ్యానించారు. ఏ సమస్యలు, సందేహాలకైనా తగు పరిష్కారమార్గాలను సూచించడానికి తమ బృందం. ఫోన్ నెంబర్స్ కై సంసిద్ధంగా ఉంటుందనీ వారు హామీ ఇచ్చారు.