ఒకప్పుడు స్టార్ హీరో సినిమా వస్తుందంటే చాలు.. కథ ఎలా ఉన్నా జనం థియేటర్లకు క్యూ కట్టేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది, ప్రేక్షకులు చాలా షార్ప్ అయిపోయారు. కేవలం హీరో క్రేజ్ చూసి కాదు, సినిమాలో మ్యాటర్ ఉంటేనే టికెట్ కొంటామని 2025 లో జరిగిన కొన్ని బాక్సాఫీస్ రిజల్ట్స్ ప్రూవ్ చేశాయి.
Also Read : Madhavan: ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన నటుడు మాధవన్!
ఈ ఏడాది రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’, ఎన్టీఆర్ ‘వార్-2’, పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ వంటి భారీ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టలేక పోయాయి. వీరంతా తిరుగులేని స్టార్ ఇమేజ్ ఉన్న హీరోలే అయినా.. ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను మెప్పించకపోవడంతో ఆ ప్రభావం కలెక్షన్లపై పడింది. కేవలం ఫ్యాన్స్‌ని మాత్రమే దృష్టిలో పెట్టుకుని సినిమాలు తీస్తే సరిపోదని, సాధారణ ప్రేక్షకులను కూడా ఆకట్టుకునేలా కంటెంట్ ఉండాలని ఈ సినిమాలు నిరూపించాయి.
ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సినిమాలనే ఉదాహరణగా తీసుకుంటే.. ‘ఓజీ’ సినిమా తన ప్రమోషనల్ కంటెంట్‌తో రికార్డులు సృష్టించి రూ. 140 కోట్లకు పైగా రాబట్టింది. కానీ అదే పవన్ నటించిన ‘హరిహర వీరమల్లు’ మాత్రం అందులో సగం కూడా వసూలు చేయలేకపోయింది. దీనికి కారణం సినిమా మీద ముందే బజ్ క్రియేట్ చేయడంలో కంటెంట్ విఫలమవ్వడమే. టికెట్ రేట్లు పెరగడం, ఓటీటీల ప్రభావం ఉన్న ఈ రోజుల్లో.. స్టార్ ఇమేజ్ సినిమాను థియేటర్ వరకు తెచ్చినా, బలమైన కంటెంట్ ఉంటేనే సినిమా గట్టెక్కుతుంది దర్శకనిర్మాతలు ఇకనైనా గుర్తించాలి.
