బిగ్ బాస్ తమిళ సీజన్ 9 గ్రాండ్ ఫినాలే జనవరి 18న ఆదివారం సాయంత్రం అత్యంత ఘనంగా జరిగింది. ప్రేక్షకుల ఉత్కంఠ మధ్య జరిగిన ఈ ఫినాలేలో దివ్య గణేష్ విజేతగా నిలిచి బిగ్ బాస్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ సీజన్‌లో శబరి మొదటి రన్నరప్‌గా, వికెల్స్ విక్రమ్ రెండవ రన్నరప్‌గా నిలిచి ప్రశంసలు అందుకున్నారు. దివ్య గణేష్ ఈ సీజన్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా బిగ్ బాస్ హౌస్‌లో అడుగుపెట్టడం విశేషం. మొదట్లో బిగ్ బాస్ లో అంతగా రాణించని దివ్య గణేష్ వారం వారం తన ఆట తీరుతో, హౌస్ మేట్స్ తో నడుచుకున్న విధానంతో ప్రేక్షకులను క్రమంగా ఆకట్టుకుంది. ప్రతి టాస్క్‌లోనూ తనదైన స్ట్రాటజీతో ముందుకెళ్లి, బలమైన కంటెస్టెంట్‌గా మారింది.
Also Read : Naari Naari Naduma Murari : డబ్బా థియేటర్స్‌కు మళ్లీ కళ తెచ్చిన హీరో శర్వానంద్
దివ్య గణేష్‌కు ఇప్పటికే సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు ఉంది. ముఖ్యంగా తమిళ్ లో ప్రసారమయ్యే ‘భాగ్యలక్ష్మి’ సీరియల్‌లో జెన్నీ పాత్రలో ఆమె చేసిన నటన ప్రేక్షకుల నుండి మంచి స్పందన రాబట్టింది. అదే ఇమేజ్‌ను బిగ్ బాస్ హౌస్‌లో కూడా కొనసాగిస్తూ క్రమ క్రమంగా ఫ్యాన్స్‌ను సంపాదించుకుంది. ఇక బిగ్ బాస్ తమిళ సీజన్ 9లో ఆమె ప్రదర్శించిన ఆట తీరుకు గాను ప్రేక్షకులు ఆమెకు ‘లేడీ టైగర్’ అనే బిరుదు ఇచ్చారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చి చివరకు విజేతగా నిలవడం అరుదైన ఘనతగా చెప్పుకోవచ్చు. తమిళ స్టార్ హీరో హీరో విజయ్ సేతుపతి హోస్ట్ చేసిన బిగ్ బాస్ తమిళ సీజన్ 9 అక్టోబర్ 5, 2025న ప్రారంభమై, జనవరి 18, 2026న ముగిసింది. మొదట అనేక విమర్శలు వచ్చినప్పటికీ చివరికి ఆడియెన్స్ ను మెప్పించి మంచి టీఆర్పీ రాబట్టింది. సీజన్ 9 టైటిల్ గెలిచిన దివ్య గణేష్ కు రూ.50 లక్షల బహుమతిని అందజేశారు.
