Site icon NTV Telugu

Devara : దేవర శాటిలైట్ రైట్స్ కొనుగోలు చేసిన స్టార్ గ్రూప్

Devara

Devara

జూనియర్ ఎన్టీయార్ హీరోగా కొరటాల శివదర్శకత్వంలో వచ్చిన దేవర. జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్, మలయాళ నటుడు టామ్ చాకో కీలక పాత్రల్లో నటించారు. గతేడాది రిలీజ్ అయినా ఈ సినిమా ఎంతటి సంచలనాలు నమోదు చేసిందో చెప్పక్కర్లేదు. ఎన్టీయార్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా  . ఫైనల్ రన్ లో ఏకంగా రూ. 500 కోట్లకు పైగా వసూలు చేసి సంచలనం సృష్టించింది.  ఈ సినిమాకు సీక్వెల్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే.

Also Read : DilRaju : సల్మాన్ ఖాన్ హీరోగా దిల్ రాజు ఫిక్స్.. డైరెక్టర్ ఇతగాడే

ప్రస్తుతం దేవర 2స్క్రిప్ట్ పనుల్లో బిజిగా ఉన్నాడు దర్శకుడు కొరటాల శివ. ఈ సంగతి పక్కన పెడితే దేవర వెండితెరపై సంచలనం చేసింది కానీ బుల్లితెరపై ఇప్పటికి ప్రసారం కాలేదు. అవును దేవర రిలీజ్ అయి సంవత్సరం దాటింది కానీ ఇప్పటికీ టెలివిజన్ లో టెలికాస్ట్ అవలేదు. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసి స్ట్రీమింగ్ చేయగా భారీ వ్యూస్ తో రికార్డులు కొల్లగొట్టింది. అదే టైమ్ లో Netflix ఒక సంవత్సరం దేవరను ప్రీమియం ఎక్స్‌క్లూజివ్ స్ట్రీమింగ్ డీల్‌తో కొనుగోలు చేసింది. ఇటీవలఈ ఒప్పందం ముగిసింది. దాంతో ఈ సినిమాను స్టార్ గ్రూప్ కొనుగోలు చేసి స్టార్ నెట్‌వర్క్‌లో టెలివిజన్ ప్రీమియర్‌ గా ఐదు భాషలలో టెలికాస్ట్ చేయబోతుంది.ఈ నెల 26న హిందీ వర్షన్ లో స్టార్ గోల్డ్ లో టెలికాస్ట్ కాబోతుంది.  తెలుగులో స్టార్ మా, తమిల్ లో విజయ్ టీవీ, కన్నడలో స్టార్ సువర్ణ, మలయాళంలో ఏషియా నెట్ లో టెలికాస్ట్ కు రెడీ అవుతోంది.

Exit mobile version