NTV Telugu Site icon

Swati Sachdeva: తల్లిపై జోకు వేయడంతో వివాదంలో స్టాండ్-అప్ కమెడియన్..

Swati Sachdeva

Swati Sachdeva

Swati Sachdeva: తాజాగా స్టాండ్-అప్ కామెడియన్ స్వాతి సచదేవా ఓ ప్రదర్శనలో చెప్పిన జోక్ కారణంగా సోషల్ మీడియాలో ఇప్పుడు ఆమె తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. తన తల్లి నా రూమ్ లో వైబ్రేటర్ కనుగొన్నప్పుడు ఎలా స్పందించిందనే విషయాన్ని హాస్యంగా వివరించడం ఇప్పుడు నెటిజన్లలో కలకలం రేపింది. ఈ వీడియో క్లిప్ శనివారం వైరల్ కావడంతో, ఇది ప్రేక్షకులలో ఆగ్రహం తెప్పించింది. కొందరు దీన్ని సరదాగా తీసుకోగా, మరికొందరు తల్లిదండ్రులను జోక్‌గా చూపించడం హద్దు దాటడం అని అభిప్రాయపడ్డారు.

స్వాతి సచదేవా చేసిన వ్యాఖ్యలు కామెడీకి హద్దులు ఉండాలా? లేక హాస్యం అనే పేరుతో ఏది చెప్పినా సరేనా? అనే చర్చకు దారి తీశాయి. ఇక అసలు విషయానికి వెళ్తే.. తాజాగా జరిగిన ఓ స్టాండ్-అప్ కమెడియన్ షోలో ఆమె మాట్లాడుతూ.. ఇటీవలే నా తల్లితో ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగిందని వివరించింది. ముందుగా తన తల్లి నా దగ్గరకు వచ్చి ‘స్నేహితురాలిగా’ తనతో మాట్లాడమని అడిగింది. ఆమె ఖచ్చితంగా వైబ్రేటర్‌ను చూపించి దానిని గాడ్జెట్ లేదా బొమ్మ అని చెప్పినట్లు తెలిపింది. అయితే దానికి నేను, అమ్మా.. ఇది నాన్నది అని సంధానం ఇచ్చినట్లు తెలిపింది. దానికి అమ్మ మూర్ఖంగా మాట్లాడకు, ఆయన గురించి నాకు తెలుసు అని, అది ఆయన సెలక్షన్ కాదని చెప్పినట్లు చెప్పింది. ఆ తర్వాత అమ్మ దాన్ని తీసి నన్ను ప్రశ్నించడం ప్రారంభించిందని చెప్పుకొచ్చింది.

ఈ జోక్‌పై నెటిజన్లు భిన్నమైన స్పందనలు తెలిపారు. కొందరు దీన్ని సరదాగా తీసుకోగా, మరికొందరు తీవ్రంగా విమర్శించారు. సోషల్ మీడియాలో కొందరు “కామెడీ పేరిట అసభ్యతను ప్రచారం చేస్తున్నారు” అంటూ విమర్శించగా.., మరొకరు తల్లి పేరు ఇలా చెప్పి ద్వారా పాపులారిటీ సంపాదించడం తగదని పేర్కొన్నారు. మరొకరేమో ఇది కామెడీ కాదు, తల్లిని అవమానించడమే వ్యాపారంగా మార్చుకున్నారని కామెంట్ చేస్తున్నారు.

ఇకపోతే, 1995లో జన్మించిన స్వాతి సచదేవా ప్రఖ్యాత స్టాండ్-అప్ కామెడియన్‌గా గుర్తింపు పొందింది. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో 1 మిలియన్‌కి పైగా ఫాలోవర్లు కలిగి ఉన్నారు. ఇదివరకు అమె అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారమైన “కామిక్‌స్తాన్” షోలో కూడా పాల్గొన్నారు. ఇప్పటివరకు 1,000కి పైగా షోలు ప్రదర్శించిన ఆమె, ప్రధానంగా పాప్ కల్చర్, రోజువారీ జీవితం వంటి విషయాలపై హాస్యం చేస్తుంటారు.