Site icon NTV Telugu

IAS Sanskriti Jain: సేవలకు దక్కిన గౌరవం.. ఐఏఎస్ అధికారిణిని పల్లకిలో మోస్తూ వీడ్కోలు పలికిన సిబ్బంది

Collector

Collector

దేశంలో అత్యుత్తమ సర్వీసులు ఐఏఎస్, ఐపీఎస్. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ తమ సేవలను అందిస్తుంటారు. అయితే కొందరు అధికారులు తమ సేవలతో ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకుంటుంటారు. ఇదేరీతిలో ఓ కలెక్టర్ ప్రజలు, సిబ్బంది నుంచి ఎనలేని గౌరవాన్ని పొందింది. తమ ప్రియమైన కలెక్టర్ బదిలీపై వెళ్తుంటే పల్లకిలో మోస్తూ వీడ్కోలు పలికారు. జబల్పూర్ రోడ్డులోని లుఘర్వాడలోని ఒక ప్రైవేట్ లాన్‌లో జరిగిన వీడ్కోలు కార్యక్రమంలో, మాజీ కలెక్టర్ సంస్కృతి జైన్‌ను సిబ్బంది తన ఇద్దరు కుమార్తెలతో కలిసి పల్లకీలో కూర్చోబెట్టి వాహనం వద్దకు తీసుకెళ్లి వీడ్కోలు పలికారు.

Also Read:Jubilee Hills ByPoll: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ఎప్పుడంటే?

ఇటీవలే, రాష్ట్ర ప్రభుత్వం సియోని కలెక్టర్ సంస్కృతి జైన్‌ను భోపాల్‌కు బదిలీ చేసింది. నూతన కలెక్టర్ శీతల పాట్లేకు స్వాగతం పలికి, సంస్కృతి జైన్‌కు వీడ్కోలు పలికే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు హాజరయ్యారు. వీడ్కోలు కార్యక్రమం తర్వాత, కలెక్టర్ సంస్కృతి జైన్ భోపాల్‌కు తన ప్రయాణాన్ని ప్రారంభించగానే, ఉద్యోగులు ఆమెను ఒక పల్లకీలో కూర్చోబెట్టి తమ భుజాలపై మోసుకెళ్లారు. కలెక్టర్ ఇద్దరు కుమార్తెలు ధ్వని, తరంగ్ జైన్ కూడా పల్లకీలో కూర్చున్నారు.

Also Read:Bihar Assembly Election 2025 Date: బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. పోలింగ్ తేదీలు ఇవే

ఉద్యోగులు తెలిపిన వివరాల ప్రకారం.. కలెక్టర్ జైన్ అవసరమైనప్పుడల్లా ముందుకు వచ్చి డిపార్ట్‌మెంటల్ సిబ్బందికి నాయకత్వం వహించేవారు, తప్పులను ఎత్తి చూపేవారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిని మెరుగుపరచడానికి కలెక్టర్ జైన్ ప్రారంభించిన “గిఫ్ట్ ఎ డెస్క్” ప్రచారం అపారమైన ప్రజాదరణ పొందింది. సమాజంలోని అన్ని వర్గాలచే ప్రశంసలు అందుకున్నారని తెలిపారు. 15 నెలల కాలంలోనే తన సేవలకు విశేషమైన గుర్తింపు లభించింది.

Exit mobile version