Site icon NTV Telugu

SSMB29 : మహేష్, రాజమౌళి మూవీ న్యూ అప్డేట్ వైరల్..

Whatsapp Image 2024 01 23 At 6.31.28 Pm

Whatsapp Image 2024 01 23 At 6.31.28 Pm

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌బాబు ఇటీవల గుంటూరు కారం మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే..త్రివిక్రమ్‌ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎస్‌ఎస్‌ఎంబీ 28గా తెరకెక్కిన గుంటూరు కారం మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12 న రిలీజ్ అయి మంచి విజయం సాధించింది. అయితే మహేష్ అభిమానులకు ఇప్పుడు ఎస్‌ఎస్‌ఎంబీ 29 ఫీవర్‌ అందుకుంది.ప్రస్తుతం మహేశ్‌బాబు ఫోకస్‌ అంతా ఇకపై ఎస్‌ఎస్‌ రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న గ్లోబల్ అడ్వెంచరస్‌ ప్రాజెక్ట్‌ ఎస్‌ఎస్‌ఎంబీ 29 పైనే వుంది. రాజమౌళి మహేశ్‌బాబు మిక్స్‌డ్‌ స్టిల్‌తో..క్యాప్షన్‌ లేదు..ఫొటో చాలా మాట్లాడుతుంది..ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ కొనసాగుతోంది.. అంటూ తాజా అప్‌డేట్ ఒకటి నెట్టింట బాగా వైరల్ అవుతోంది.ఆఫ్రికన్‌ అడ్వెంచరస్‌ ప్రాజెక్ట్‌గా రాబోతున్న ఎస్‌ఎస్‌ఎంబీ 29 స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి చేశానని ఇప్పటికే రైటర్ విజయేంద్రప్రసాద్ చెప్పిన విషయం తెలిసిందే.

అంతేకాదు ఈ మూవీలో పాపులర్‌ హాలీవుడ్ యాక్టర్‌ కూడా నటించే అవకాశాలున్నాయని  ఆయన వెల్లడించారు. ఈ చిత్రాన్ని 2026 ఉగాది కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్టున్నట్టు సమాచారం. ఎంఎం కీరవాణి ఇప్పటికే మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ కూడా షురూ చేసారని తెలుస్తుంది.. అంతేకాదు అమృతం ఫేం ఎస్‌ఎస్‌ కంచి ఈ చిత్రానికి వన్ ఆఫ్‌ ది స్టోరీ రైటర్‌గా వ్యవహరించనున్నారట.అంతర్జాతీయ స్థాయిలో యాక్షన్‌ డ్రామా నేపథ్యంలో రాబోతున్న ఈ చిత్రంలో పాపులర్‌ హిందీ యాక్టర్లతోపాటు వరల్డ్‌వైడ్‌గా ఉన్న స్టార్‌ యాక్టర్లను తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ గ్లోబల్‌ అడ్వెంచరస్‌ మూవీ కోసం రామోజీఫిలిం సిటీలో ఏకంగా రూ.100 కోట్ల ఖర్చుతో భారీ సెట్‌లో షూటింగ్‌కు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.సినిమాలో ఎక్కువభాగం ఈ సెట్‌లోనే షూటింగ్ జరుగనుందని సమాచారం.. మిగిలిన భాగాన్ని ఆఫ్రికా, యూరప్‌ లో ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఎస్‌ఎస్‌ఎంబీ 29కు సంబంధించిన రానున్న రోజుల్లో వరుస అప్డేట్స్ రానున్నట్లు తెలుస్తుంది.

Exit mobile version