NTV Telugu Site icon

SSMB 29: మహేశ్-రాజమౌళి ప్రాజెక్ట్‌లో బాలీవుడ్‌ నటుడు!

Devdatta Nage In Ssmb 29

Devdatta Nage In Ssmb 29

Devdatta Nage in Mahesh Babu’s Movie: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌ బాబు, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. మహేశ్-రాజమౌళి ప్రాజెక్ట్‌కు SSMB29 అనేది వర్కింగ్‌ టైటిల్‌. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్‌ ఇస్లాన్‌ హీరోయిన్‌గ.. హాలీవుడ్‌ నటుడు క్రిస్‌ హెమ్స్‌వర్త్‌ కీలక పాత్ర పోషించనున్నారని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా మరో వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.

మహేశ్-రాజమౌళి ప్రాజెక్ట్‌లో బాలీవుడ్‌ నటుడు దేవదత్త నాగే నటిస్తునట్లు పలు జాతీయ వైబ్‌సైట్స్‌లలో కథనాలు వస్తున్నాయి. ఆదిపురుష్‌లో హనుమంతుడిగా నటించిన దేవదత్త.. రాజమౌళి ప్రాజెక్ట్‌తో మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించనున్నాడట. తాజాగా రాజమౌళితో దేవదత్త ఫొటో దిగడం కూడా ఈ వార్తకు బలం చేకూరింది. ఇటీవల మలయాళ హీరో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించనున్నట్లు వార్తలు వచ్చాయి. ఆయన విలన్‌గా కనిపించనున్నారని టాక్‌. ఈ వార్తలపై చిత్ర యూనిట్ ఇప్పటివరకు స్పందించలేదు.

Also Read: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?

అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే ఈ కథ కోసం మహేశ్‌ బాబుకు సంబంధించిన ఎనిమిది లుక్‌లను ఎస్ఎస్ రాజమౌళి టీమ్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి ‘మహారాజ్‌’ అనే టైటిల్‌ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఇండియన్ సినిమా ఇప్పటివరకు చూడని సరికొత్త ప్రపంచాన్ని రాజమౌళి ఈ చిత్రంతో సృష్టించనున్నట్లు తెలుస్తోంది. SSMB29పై పూర్తి వివరాలు త్వరలోనే తెలియరానున్నాయి.

Show comments